Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
POCSO CASE: చర్లపల్లి జైలుకు బండి భగీరథ్

POCSO CASE: చర్లపల్లి జైలుకు బండి భగీరథ్

TV5 News 1 week ago

By - Sathwik |17 May 2026 9:00 AM IST

బండి భగీరథ్‌కు 14 రోజుల రిమాండ్

బండి భగీ­ర­థ్‌­కు మే­డ్చ­ల్ మే­జి­స్ట్రే­ట్ 14 రో­జుల రి­మాం­డ్ వి­ధిం­చా­రు.

పో­క్సో కే­సు­లో అరె­స్ట­యిన బండి భగీ­ర­థ్‌­ను పేట్ బషీ­రా­బా­ద్ పో­లీ­సు­లు న్యా­య­మూ­ర్తి ఎదుట హా­జ­రు­ప­ర­చ­గా రెం­డు వా­రా­ల­పా­టు రి­మాం­డ్ వి­ధిం­చ­గా.. అత­డ్ని చర్ల­ప­ల్లి జై­లు­కు తర­లిం­చా­రు. మే­జి­స్ట్రే­ట్ ఎదుట హా­జ­రు­ప­ర­చ­డా­ని­కి ముం­దు సిట్ అధి­కా­రు­లు దా­దా­పు 2 గం­ట­ల­పా­టు భగీ­ర­థ్‌­ను ప్ర­శ్నిం­చా­రు. తరు­వాత మే­డ్చ­ల్ గవ­ర్న­మెం­ట్ హా­స్పి­ట­ల్‌­లో మె­డి­క­ల్ టె­స్టు­లు ని­ర్వ­హిం­చిన తరు­వాత కో­ర్టు­కు తీ­సు­కొ­చ్చా­రు పో­లీ­సు­లు.

బాధితుల వాంగ్మూలం సేకరణ..

పోక్సో కేసుకు సంబంధించి ఫిర్యాదుదారులైన బాలిక తల్లి, బాధిత బాలిక వాంగ్మూలాలను పోలీసు అధికారులు శనివారం మేడ్చల్‌ కోర్టులో మెజిస్ట్రేట్‌ సమక్షంలో నమోదు చేయించారు. భగీరధ్‌తో పరిచయం దగ్గర్నుంచి అతడు వివిధ సందర్భాల్లో శారీరకంగా కలవడానికి ఒత్తిడి తేవడం, మొయినాబాద్‌ ఫాంహౌస్‌లో బలహీన స్ధితిలో ఉన్నప్పుడు లైంగికదాడికి ప్రయత్నించిన విషయం, బలవంతంగా బాలికకు మద్యం తాగించిన విషయాన్ని, కేసు నమోదైనప్పటి నుంచి తాము ఎదుర్కొంటున్న బాధ, ఎదురవుతున్న ఒత్తిళ్లకు సంబంధించి పూర్తి సమాచారాన్ని తల్లీకూతుళ్లు తమ వాంగ్మూలంలో వివరించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ కేసుకు సంబంధించిన కీలక ఎలక్ర్టానిక్‌, డిజిటల్‌ ఆధారాలు, వాట్సాప్‌ చాట్‌లను బాలిక నుంచి సేకరించిన డీసీపీ రితిరాజ్‌ బృందం.. వాటిని కోర్టు అనుమతితో ఫోరెన్సిక్‌ సైన్స్‌ లేబొరేటరీకి పంపడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ ఆధారాలను పరిరక్షించాలని, తారుమారు కాకుండా చూడాలని బాధిత బాలిక తల్లి బహిరంగ లేఖలో విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు తమ వద్ద ఉన్న ఆధారాలపై సమీక్ష నిర్వహించినట్లు తెలుస్తోంది.

మిత్రులను విచారించిన పోలీసులు

భగీరథ్‌తో కలిసి ఉన్న స్నేహితులను పోలీసు స్టేషన్‌కు అధికారులు పిలిపించి విచారించారు. అలాగే భగీరథ్‌కు మద్దతుగా బాధితురాలి ఫొటోలు, వీడియోలను సోషల్‌ మీడియాలో వైరల్‌ చేసిన మిత్రులను పోలీసులు విచారించారు. ఆ ఫొటోలు, వీడియోలు మీకు ఎప్పుడు వచ్చాయి? ఎవరు పంపించారు? ఏయే ఫోన్‌ నెంబర్ల నుంచి భగీరథ్‌ మీతో టచ్‌లో ఉన్నాడు? వంటి వివరాలను పోలీసు అధికారులు తెలుసుకున్నారు. మరోవైపు బండి సంజయ్‌ సన్నిహిత బంధువులను సైతం పోలీసు స్టేషన్‌కు పిలిపించి పోలీసులు విచారించారు.

బండి భగీ­ర­థ్‌­కు మే­డ్చ­ల్ మే­జి­స్ట్రే­ట్ 14 రో­జుల రి­మాం­డ్ వి­ధిం­చా­రు. పో­క్సో కే­సు­లో అరె­స్ట­యిన బండి భగీ­ర­థ్‌­ను పేట్ బషీ­రా­బా­ద్ పో­లీ­సు­లు న్యా­య­మూ­ర్తి ఎదుట హా­జ­రు­ప­ర­చ­గా రెం­డు వా­రా­ల­పా­టు రి­మాం­డ్ వి­ధిం­చ­గా.. అత­డ్ని చర్ల­ప­ల్లి జై­లు­కు తర­లిం­చా­రు. మే­జి­స్ట్రే­ట్ ఎదుట హా­జ­రు­ప­ర­చ­డా­ని­కి ముం­దు సిట్ అధి­కా­రు­లు దా­దా­పు 2 గం­ట­ల­పా­టు భగీ­ర­థ్‌­ను ప్ర­శ్నిం­చా­రు. తరు­వాత మే­డ్చ­ల్ గవ­ర్న­మెం­ట్ హా­స్పి­ట­ల్‌­లో మె­డి­క­ల్ టె­స్టు­లు ని­ర్వ­హిం­చిన తరు­వాత కో­ర్టు­కు తీ­సు­కొ­చ్చా­రు పో­లీ­సు­లు.

బాధితుల వాంగ్మూలం సేకరణ..

మిత్రులను విచారించిన పోలీసులు

బాధితుల వాంగ్మూలం సేకరణ..

మిత్రులను విచారించిన పోలీసులు

బాధితుల వాంగ్మూలం సేకరణ..

మిత్రులను విచారించిన పోలీసులు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: TV5 Telugu