Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
POLAVARAM: పోలవరం నిర్వసితులకు సర్కార్ శుభవార్త

POLAVARAM: పోలవరం నిర్వసితులకు సర్కార్ శుభవార్త

TV5 News 1 week ago

By - Sathwik |16 May 2026 11:00 AM IST

రూ. 306.61 కోట్ల పరిహారం అందజేత

పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ఊరటనిచ్చింది.

పునరావాసం, పరిహారం అంశాలపై చాలా కాలంగా ఎదురుచూస్తున్న వేలాది కుటుంబాలకు ప్రభుత్వం శుభవార్త అందించింది. పరిహారం చెల్లింపులతో పాటు పునరావాస కాలనీల్లో ఇళ్ల కేటాయింపును కూడా వేగవంతం చేస్తూ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నిర్వాసితులకు ఆర్థిక సహాయం, ఇళ్ల తాళాల పంపిణీ చేపట్టడం ప్రత్యేకంగా నిలిచింది. అదే సమయంలో పోలవరం ప్రాజెక్టు పూర్తి, భవిష్యత్తులో నదుల అనుసంధానం వంటి అంశాలపై కూడా ముఖ్యమంత్రి తన దృష్టికోణాన్ని వెల్లడించారు.ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పోలవరం ప్రాజెక్టు ప్రభావిత కుటుంబాలకు రూ.306.61 కోట్ల పరిహారం అందజేశారు. అలాగే పునరావాసం పొందుతున్న కుటుంబాలకు సంబంధించి ఆర్ అండ్ ఆర్ కాలనీల్లో కేటాయించిన ఇళ్ల తాళాలను కూడా పంపిణీ చేశారు. భూములు కోల్పోయిన కుటుంబాలకు ప్రత్యామ్నాయంగా భూములు అందించే ప్రక్రియలో భాగంగా ఇళ్ల స్థలాల కోసం 62.05 ఎకరాలు, భూమికి భూమి పథకం కింద మొత్తం 520.02 ఎకరాలను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు.

చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వాసితులకు పరిహారం చెల్లించడం ఇది నాలుగో విడత అని ప్రభుత్వం పేర్కొంది. పోలవరం ప్రాజెక్టు కారణంగా భూములు, నివాసాలు కోల్పోయిన కుటుంబాలకు న్యాయం చేయడమే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు, పోలవరం ప్రాజెక్టును కేవలం సాగునీటి ప్రాజెక్టుగా కాకుండా రాష్ట్ర భవిష్యత్తును మార్చే అభివృద్ధి ప్రణాళికగా అభివర్ణించారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు కూడా ఆయన ప్రకటించారు. పోలవరం, రంపచోడవరం వంటి గిరిజన నియోజకవర్గాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. భూములు కోల్పోయిన నిర్వాసితులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగదని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు పనులు అనుకున్న సమయానికి పూర్తిచేస్తామని, ప్రాజెక్టు నిర్మాణంలో వేగం పెంచుతామని వెల్లడించారు.

ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా నీటి వనరుల వినియోగంపై కూడా ముఖ్యమంత్రి తన అభిప్రాయాలను వెల్లడించారు. గంగా, కావేరి నదులను అనుసంధానం చేయడం తన దీర్ఘకాలిక లక్ష్యమని పేర్కొన్నారు. దేశంలోని ప్రధాన నదులను అనుసంధానం చేయగలిగితే భవిష్యత్తులో నీటి సమస్యలు చాలా వరకు పరిష్కారమవుతాయని అభిప్రాయపడ్డారు. దేశంలో ఎక్కడా నీటి కొరత లేకుండా చేయడం ద్వారా వ్యవసాయం, తాగునీటి అవసరాలు, అభివృద్ధి రంగాలకు దీర్ఘకాలిక ప్రయోజనాలు కలుగుతాయని చెప్పారు. అలాగే గత ప్రభుత్వ పాలనపై కూడా చంద్రబాబు విమర్శలు చేశారు. 2022లో వచ్చిన వరదల సమయంలో ముంపు గ్రామాలను తాను సందర్శించిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ సమయంలో బాధితులకు కనీస సదుపాయాలు కూడా అందించలేదని ఆరోపించారు. తమ ప్రభుత్వం 2019 తర్వాత కూడా కొనసాగి ఉంటే పోలవరం ప్రాజెక్టు 2020 నాటికే పూర్తయ్యేదని పేర్కొన్నారు. నిర్వాసితులకు పరిహారం పెంచుతామని చెప్పి గత ప్రభుత్వం అమలు చేయలేదని విమర్శించారు. ప్రాజెక్టు నిర్మాణ ప్రక్రియలో అధికారుల మార్పులు, కాంట్రాక్టర్ల మార్పులు వంటి నిర్ణయాల వల్ల పనులు దెబ్బతిన్నాయని ఆయన ఆరోపించారు. ఆ కారణంగా ప్రాజెక్టు పురోగతి మందగించిందని అన్నారు. అయితే ప్రస్తుతం ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 2027 గోదావరి పుష్కరాల కంటే ముందుగానే పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందని ధీమా వ్యక్తం చేశారు.

కార్యక్రమంలో పాల్గొన్న నిర్వాసితులు కూడా తమ అభిప్రాయాలను ముఖ్యమంత్రితో పంచుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో పరిహారం, పునరావాస పనులపై నమ్మకం కోల్పోయామని, ప్రాజెక్టు పూర్తి అవుతుందనే ఆశ కూడా తగ్గిపోయిందని చెప్పారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో మళ్లీ నమ్మకం కలుగుతోందని పేర్కొన్నారు. ముఖ్యంగా నాలుగు విడతల్లో పరిహారం అందించడం తమలో భరోసా పెంచిందని, ప్రాజెక్టు పూర్తయ్యే దిశగా చర్యలు కనిపిస్తున్నాయని వారు అభిప్రాయపడ్డారు.

పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ఊరటనిచ్చింది. పునరావాసం, పరిహారం అంశాలపై చాలా కాలంగా ఎదురుచూస్తున్న వేలాది కుటుంబాలకు ప్రభుత్వం శుభవార్త అందించింది. పరిహారం చెల్లింపులతో పాటు పునరావాస కాలనీల్లో ఇళ్ల కేటాయింపును కూడా వేగవంతం చేస్తూ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నిర్వాసితులకు ఆర్థిక సహాయం, ఇళ్ల తాళాల పంపిణీ చేపట్టడం ప్రత్యేకంగా నిలిచింది. అదే సమయంలో పోలవరం ప్రాజెక్టు పూర్తి, భవిష్యత్తులో నదుల అనుసంధానం వంటి అంశాలపై కూడా ముఖ్యమంత్రి తన దృష్టికోణాన్ని వెల్లడించారు.ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పోలవరం ప్రాజెక్టు ప్రభావిత కుటుంబాలకు రూ.306.61 కోట్ల పరిహారం అందజేశారు. అలాగే పునరావాసం పొందుతున్న కుటుంబాలకు సంబంధించి ఆర్ అండ్ ఆర్ కాలనీల్లో కేటాయించిన ఇళ్ల తాళాలను కూడా పంపిణీ చేశారు. భూములు కోల్పోయిన కుటుంబాలకు ప్రత్యామ్నాయంగా భూములు అందించే ప్రక్రియలో భాగంగా ఇళ్ల స్థలాల కోసం 62.05 ఎకరాలు, భూమికి భూమి పథకం కింద మొత్తం 520.02 ఎకరాలను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు.

చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: TV5 Telugu