Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Ram Pothineni :  రామ్ కి హీరోయిన్ సెట్ అయింది.. మరి విలన్..?

Ram Pothineni : రామ్ కి హీరోయిన్ సెట్ అయింది.. మరి విలన్..?

TV5 News 5 days ago

By - TV5 Entertainment |19 May 2026 2:56 PM IST

రామ్ పోతినేని హీరోగా ఈ మధ్య కాలంలో చాలా ఫ్లాపులు చూస్తున్నాడు. ఒక్కటీ హిట్ కావడం లేదు. అతని లాస్ట్ హిట్ ఏంటీ అంటే సడెన్ గా అతను కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నాడు.

లాస్ట్ గా చేసిన ఆంధ్రాకింగ్ తాలూకాకు మంచి రివ్యూస్ వచ్చాయి కానీ విజయం మాత్రం రాలేదు. దీంతో గేర్ మార్చాడు. అసలు ఇంకెవరో తనకు సినిమాలు చేయడం ఏంటీ.. నేనే చేస్తా అని ఫిక్స్ అయ్యాడు. తనే నిర్మాతగా సినిమా చేస్తూ ఏకంగా దర్శకత్వం కూడా మొదలు పెట్టాడు. ఇది అతనికి ఫస్ట్ మూవీ డైరెక్టర్ గా. ఇదో మాస్ ఎంటర్టైనర్ అని చెబుతున్నాడు. బట్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశాడు. తన ఫేస్ కనిపించకుండా 'వీరా'ని పరిచయం చేశాడు. దీంతో పాటు అతనో ఒంటరి తోడేలు అనే క్యాప్షన్ కూడా పెట్టాడు. అలాగే ఇదో సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ అని కూడా చెప్పాడు. సడెన్ గా అతను దర్శకుడుగా అన్నప్పుడు చాలామంది ఆశ్చర్యపోయారు. ఆ ఆశ్చర్యాన్ని కంటిన్యూ చేస్తూ.. ఇప్పుడీ మూవీ సెట్స్ లో ఉంది.

ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా శ్రీనిధి శెట్టిని ఫైనల్ చేశాడు. శ్రీనిధి అంటే మంచి ఛాయిస్ అనే చెప్పాలి. కాకపోతే హైట్ వల్ల ఏదైనా ఇబ్బంది ఉంటుందేమో చూడాలి. హీరోయిన్ ఫైనల్ అయింది. అయితే ఇదే మూవీలో విలన్ గా ఫహాద్ ఫాజిల్ ను తీసుకోవాలనుకున్నాడు. అతనికి కథ కూడా చెప్పాడు. కానీ ఫహాద్ చెప్పిన రెమ్యూనరేషన్ కు మనోడికి మైండ్ పోయింది. అందుకే అతను కాదు అని ఎస్.జే సూర్యను తీసుకోవాలనుకుంటున్నాడు. ప్రస్తుతం సూర్యకు కథ వినిపించే ప్రయత్నం చేస్తున్నాడు. సూర్య ఆల్మోస్ట్ ఫైనల్ అయినట్టే అని సమాచారం. మొత్తంగా రామ్ ఈ సారి సరైన నిర్ణయాలతో రాబోతున్నాడు అనిపిస్తోంది. మరి ఈ మూవీతో అయినా మనోడు మంచి విజయాన్ని అందుకుంటాడో లేదో అని చూడాలి.

రామ్ పోతినేని హీరోగా ఈ మధ్య కాలంలో చాలా ఫ్లాపులు చూస్తున్నాడు. ఒక్కటీ హిట్ కావడం లేదు. అతని లాస్ట్ హిట్ ఏంటీ అంటే సడెన్ గా అతను కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నాడు. లాస్ట్ గా చేసిన ఆంధ్రాకింగ్ తాలూకాకు మంచి రివ్యూస్ వచ్చాయి కానీ విజయం మాత్రం రాలేదు. దీంతో గేర్ మార్చాడు. అసలు ఇంకెవరో తనకు సినిమాలు చేయడం ఏంటీ.. నేనే చేస్తా అని ఫిక్స్ అయ్యాడు. తనే నిర్మాతగా సినిమా చేస్తూ ఏకంగా దర్శకత్వం కూడా మొదలు పెట్టాడు. ఇది అతనికి ఫస్ట్ మూవీ డైరెక్టర్ గా. ఇదో మాస్ ఎంటర్టైనర్ అని చెబుతున్నాడు. బట్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశాడు. తన ఫేస్ కనిపించకుండా 'వీరా'ని పరిచయం చేశాడు. దీంతో పాటు అతనో ఒంటరి తోడేలు అనే క్యాప్షన్ కూడా పెట్టాడు. అలాగే ఇదో సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ అని కూడా చెప్పాడు. సడెన్ గా అతను దర్శకుడుగా అన్నప్పుడు చాలామంది ఆశ్చర్యపోయారు. ఆ ఆశ్చర్యాన్ని కంటిన్యూ చేస్తూ.. ఇప్పుడీ మూవీ సెట్స్ లో ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: TV5 Telugu