Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
RAPE: మద్యం తాగించి.. బీటెక్‌ విద్యార్థినిపై అత్యాచారం

RAPE: మద్యం తాగించి.. బీటెక్‌ విద్యార్థినిపై అత్యాచారం

TV5 News 5 days ago

By - Sathwik |19 May 2026 11:00 AM IST

ఇబ్రహీంపట్నంలో దారుణ ఘటన

ఇంజినీరింగ్‌ చదువుతున్న ఓ విద్యార్థినిపై తోటి విద్యార్థి లైంగిక దాడికి పాల్పడిన ఘటన హైదరాబాద్‌ శివారు ప్రాంతమైన ఇబ్రహీంపట్నంలో వెలుగులోకి రావడం కలకలం రేపింది.

స్నేహం పేరుతో బయటకు తీసుకెళ్లి, నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని ఈ దారుణానికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా ఆందోళనకు దారితీసింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌కు చెందిన ఉడుతల ఉదయ్‌... రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పరిధిలోని ఒక ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతున్నాడు. అదే కళాశాలలో చదువుతున్న తన క్లాస్‌మేట్‌తో అతనికి పరిచయం ఉంది. ఈ నెల 14వ తేదీ రాత్రి ఇద్దరూ కలిసి టీ తాగేందుకు కారులో దిల్‌సుఖ్‌నగర్‌కు వెళ్లినట్లు తెలిసింది. తిరుగు ప్రయాణంలో ఉదయ్‌ మద్యం కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం ఇబ్రహీంపట్నం పరిధిలోని బీడీఎల్‌ రోడ్డులో నిర్మానుష్య ప్రాంతానికి కారును తీసుకెళ్లినట్లు విచారణలో వెల్లడైంది. అక్కడ యువతికి కూడా మద్యం తాగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. మద్యం మత్తులో ఉన్న బాధితురాలిని తరువాత ఇబ్రహీంపట్నంలోని ఒక గదికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు.

కొన్ని రోజుల తరువాత బాధితురాలు జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో వ్యవహారం బయటపడింది. అనంతరం ఈ నెల 17న ఆమె పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు, సేకరించిన ఆధారాలు, ప్రాథమిక విచారణ అనంతరం నిందితుడు ఉదయ్‌ను అరెస్ట్‌ చేశారు.వైద్య పరీక్షలు, బాధితురాలి వాంగ్మూలం, ఇతర సాంకేతిక ఆధారాల ఆధారంగా తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం అతడిని రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు. ఈ ఘటన విద్యార్థుల భద్రత, స్నేహ సంబంధాల పేరిట జరుగుతున్న నేరాలపై మరోసారి చర్చకు కారణమవుతోంది.

ఇంజినీరింగ్‌ చదువుతున్న ఓ విద్యార్థినిపై తోటి విద్యార్థి లైంగిక దాడికి పాల్పడిన ఘటన హైదరాబాద్‌ శివారు ప్రాంతమైన ఇబ్రహీంపట్నంలో వెలుగులోకి రావడం కలకలం రేపింది. స్నేహం పేరుతో బయటకు తీసుకెళ్లి, నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని ఈ దారుణానికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా ఆందోళనకు దారితీసింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌కు చెందిన ఉడుతల ఉదయ్‌... రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పరిధిలోని ఒక ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతున్నాడు. అదే కళాశాలలో చదువుతున్న తన క్లాస్‌మేట్‌తో అతనికి పరిచయం ఉంది. ఈ నెల 14వ తేదీ రాత్రి ఇద్దరూ కలిసి టీ తాగేందుకు కారులో దిల్‌సుఖ్‌నగర్‌కు వెళ్లినట్లు తెలిసింది. తిరుగు ప్రయాణంలో ఉదయ్‌ మద్యం కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం ఇబ్రహీంపట్నం పరిధిలోని బీడీఎల్‌ రోడ్డులో నిర్మానుష్య ప్రాంతానికి కారును తీసుకెళ్లినట్లు విచారణలో వెల్లడైంది. అక్కడ యువతికి కూడా మద్యం తాగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. మద్యం మత్తులో ఉన్న బాధితురాలిని తరువాత ఇబ్రహీంపట్నంలోని ఒక గదికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: TV5 Telugu