Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
RECORD: భారత అత్యంత వేగవంతమైన రన్నర్‌ గురిందర్‌వీర్

RECORD: భారత అత్యంత వేగవంతమైన రన్నర్‌ గురిందర్‌వీర్

TV5 News 5 days ago

By - Sathwik |24 May 2026 5:15 PM IST

100 మీటర్ల పరుగు.. నేషనల్ రికార్డ్.. అద్లెటిక్స్ చరిత్రలో కొత్త అధ్యాయం.. 10.09 సెకనల్లోనే 100 మీటర్లు పూర్తి

భారత అథ్లె­టి­క్స్ రం­గం­లో కొ­త్త శకం ప్రా­రం­భ­మ­వు­తోం­ద­నే సం­కే­తా­లు మరింత స్ప­ష్టం­గా కని­పి­స్తు­న్నా­యి. గతం­లో స్ప్రిం­ట్ ఈవెం­ట్ల­లో ప్ర­పంచ స్థా­యి­లో పోటీ ఇవ్వ­డం­లో భా­ర­త్ వె­ను­క­బ­డిం­ద­నే అభి­ప్రా­యా­లు వ్య­క్త­మ­య్యే­వి. అయి­తే ఇప్పు­డు యువ అథ్లె­ట్లు తమ అసా­ధా­రణ ప్ర­ద­ర్శ­న­ల­తో ఆ అభి­ప్రా­యా­ల­ను పూ­ర్తి­గా మా­ర్చే­స్తు­న్నా­రు. రాం­చీ­లో జరి­గిన ఫె­డ­రే­ష­న్ కప్ పో­టీ­లు భారత ట్రా­క్ అండ్ ఫీ­ల్డ్ చరి­త్ర­లో గు­ర్తుం­డి­పో­యే ఘట్టా­ల­కు వే­ది­క­గా ని­లి­చా­యి. ము­ఖ్యం­గా పు­రు­షుల 100 మీ­ట­ర్ల రే­సు­లో పం­జా­బ్‌­కు చెం­దిన స్ప్రిం­ట­ర్ గు­రిం­ద­ర్‌­వీ­ర్ సిం­గ్ చూ­పిన ప్ర­తిభ దేశ క్రీ­డా చరి­త్ర­లో మరో స్వ­ర్ణ అధ్యా­యా­న్ని లి­ఖిం­చిం­ది. రాం­చీ­లో­ని బి­ర్సా ముం­డా స్టే­డి­యం­లో జరి­గిన ఈ పో­టీ­ల్లో 25 ఏళ్ల గు­రిం­ద­ర్‌­వీ­ర్ సిం­గ్ తన వే­గం­తో అం­ద­రి­నీ ఆశ్చ­ర్య­ప­రి­చా­డు. పు­రు­షుల 100 మీ­ట­ర్ల రే­సు­లో కే­వ­లం 10.09 సె­క­న్ల­లో లక్ష్యా­న్ని చే­రు­కు­ని కొ­త్త జా­తీయ రి­కా­ర్డు­ను తన పే­రిట నమో­దు చే­సు­కు­న్నా­డు. ఇది కే­వ­లం ఒక కొ­త్త రి­కా­ర్డు మా­త్ర­మే కాదు, భారత అథ్లె­టి­క్స్ చరి­త్ర­లో ఒక ప్ర­త్యేక మై­లు­రా­యి­గా ని­లి­చిం­ది. భా­ర­తీయ అథ్లె­ట్ తొ­లి­సా­రి­గా 100 మీ­ట­ర్ల రే­సు­ను 10.09 సె­క­న్ల లోపు పూ­ర్తి చే­య­డం వి­శే­షం­గా మా­రిం­ది. దీం­తో గు­రిం­ద­ర్‌­వీ­ర్ ప్ర­స్తు­తం దే­శం­లో­నే అత్యంత వే­గ­వం­త­మైన అథ్లె­ట్‌­గా గు­ర్తిం­పు పొం­దా­డు.

ఈ ప్ర­ద­ర్శ­న­తో భా­ర­త్ అం­త­ర్జా­తీయ స్ప్రిం­ట్ పో­టీ­ల్లో కూడా తన ము­ద్ర వే­య­గ­ల­ద­నే ఆశలు పె­రి­గా­యి. ప్ర­పంచ స్థా­యి పో­టీ­ల్లో కని­పిం­చే టై­మిం­గ్స్‌­కు దగ్గ­ర­గా ఉండే వి­ధం­గా గు­రిం­ద­ర్‌­వీ­ర్ ప్ర­ద­ర్శన ఉం­డ­టం వి­శ్లే­ష­కు­ల­ను ఆక­ట్టు­కుం­ది. అతని వేగం భవి­ష్య­త్తు­లో ఒలిం­పి­క్స్, కా­మ­న్వె­ల్త్ గే­మ్స్, ఆసి­యా క్రీ­డ­ల్లో దే­శా­ని­కి మరి­న్ని అవ­కా­శా­లు తీ­సు­కు­రా­వ­చ్చ­నే అభి­ప్రా­యా­లు వ్య­క్త­మ­వు­తు­న్నా­యి. ఫి­ని­షిం­గ్ లైన్ దా­టిన వెం­ట­నే గు­రిం­ద­ర్‌­వీ­ర్ ఆనం­దం­తో ఉప్పొం­గి­పో­యా­డు. వి­జ­యం సా­ధిం­చిన క్ష­ణం­లో తన భా­వో­ద్వే­గా­ల­ను దా­చు­కో­లే­క­పో­యా­డు. ఛా­తీ­పై ఉన్న బిబ్ నం­బ­ర్‌­ను తీ­సి­వే­సి, తన బూ­ట్ల­ను ట్రా­క్‌­పై­కి వి­సు­రు­తూ వి­జ­యో­త్సా­హా­న్ని వ్య­క్తం చే­శా­డు. అతని స్పం­దన చూ­స్తే ఈ వి­జ­యం కోసం ఎం­త­కా­లం శ్ర­మిం­చా­డో స్ప­ష్ట­మైం­ది. తన వి­జ­యం­పై స్పం­ది­స్తూ గు­రిం­ద­ర్‌­వీ­ర్ ఆస­క్తి­కర వ్యా­ఖ్య­లు చే­శా­డు. భా­ర­తీ­యు­ల­కు 100 మీ­ట­ర్ల పరు­గు­లో రా­ణిం­చే జన్యు­ప­ర­మైన సా­మ­ర్థ్యం తక్కు­వ­గా ఉం­టుం­ద­ని చా­లా­మం­ది చె­బు­తుం­టా­ర­ని, అలాం­టి అభి­ప్రా­యా­లు తప్ప­ని ని­రూ­పిం­చా­ల­ని తాను ఎప్ప­టి నుం­చో అను­కు­న్నా­న­ని పే­ర్కొ­న్నా­డు. భా­ర­తీ­యుల సా­మ­ర్థ్యా­న్ని తక్కువ అం­చ­నా వే­య­డం సరి­కా­ద­ని, ఇది కే­వ­లం ప్రా­రం­భం మా­త్ర­మే­న­ని ధీమా వ్య­క్తం చే­శా­డు.

ఈ సీ­జ­న్‌­లో ఆసి­యా స్థా­యి­లో నమో­దైన అత్యంత వే­గ­వం­త­మైన సమ­యా­ల్లో గు­రిం­ద­ర్‌­వీ­ర్ 10.09 సె­క­న్లు రెం­డో స్థా­నం­లో ని­లి­చా­యి. జపా­న్‌­కు చెం­దిన స్ప్రిం­ట­ర్ ఫు­కు­టో కొ­ము­రో నమో­దు చే­సిన 10.08 సె­క­న్ల సమ­యా­ని­కి కే­వ­లం 0.01 సె­క­న్ల తే­డా­తో వె­ను­క­బ­డ్డా­డు. ఇదే సమ­యం­లో 2026 కా­మ­న్వె­ల్త్ గే­మ్స్‌­కు అర్హత సా­ధిం­చేం­దు­కు అవ­స­ర­మైన 10.16 సె­క­న్ల మా­ర్క్‌­ను కూడా అతను సు­ల­భం­గా అధి­గ­మిం­చా­డు. అయి­తే ఈ టో­ర్నీ­లో మరో ఆస­క్తి­కర అంశం జా­తీయ రి­కా­ర్డు­లు కొ­న్ని ని­మి­షాల వ్య­వ­ధి­లో­నే రెం­డు­సా­ర్లు మా­ర­డం. ఒడి­శా­కు చెం­దిన స్ప్రిం­ట­ర్ అని­మే­ష్ కు­జు­ర్ ఈ ఈవెం­ట్‌­లో ఫే­వ­రె­ట్‌­గా బరి­లో­కి ది­గా­డు. గతం­లో 10.18 సె­క­న్ల జా­తీయ రి­కా­ర్డు అతని పే­రిట ఉం­డే­ది. మొ­ద­టి సె­మీ­ఫై­న­ల్లో గు­రిం­ద­ర్‌­వీ­ర్ 10.17 సె­క­న్ల­తో ఆ రి­కా­ర్డు­ను అధి­గ­మిం­చా­డు. దీంతో ఒకేరోజులో జాతీయ రికార్డు రెండు సార్లు మారడం పోటీలను మరింత ఉత్కంఠభరితంగా మార్చింది. అయితే అసలు పోరాటం ఫైనల్‌లో కనిపించింది. ఫైనల్ రేసులో గురిందర్‌వీర్ మరోసారి తన పూర్తి సామర్థ్యాన్ని ప్రదర్శించాడు. అనిమేష్ కంటే 0.11 సెకన్లు వేగంగా పరిగెత్తి దాదాపు రెండు అడుగుల తేడాతో ఫినిషింగ్ లైన్ దాటాడు. రిలయన్స్ ఫౌండేషన్‌కు చెందిన ప్రణవ్ గురవ్ 10.29 సెకన్లతో మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు.

తన విజయ రహస్యాన్ని వెల్లడిస్తూ గురిందర్‌వీర్ మాట్లాడుతూ, తమ శిక్షణలో బలహీనతలను గుర్తించి వాటిని మెరుగుపరచడంపై దృష్టి పెట్టామని పేర్కొన్నాడు. కేవలం శారీరకంగా బలంగా ఉండటం మాత్రమే సరిపోదని, మానసికంగా కూడా దృఢంగా ఉండాల్సిన అవసరం ఉందని వివరించాడు. చివరి క్షణాల్లో మానసిక స్థైర్యమే విజయాన్ని నిర్ణయిస్తుందని అభిప్రాయపడ్డాడు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: TV5 Telugu