By - Sathwik |15 May 2026 1:15 PM IST
కీలక కసరత్తు ప్రారంభించిన తెలంగాణ సర్కార్
తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది.
ఉద్యోగుల డిమాండ్లపై సానుకూలంగా స్పందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, వాటి అమలుకు సంబంధించి చర్చలను వేగవంతం చేస్తోంది. ఈ క్రమంలో రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ సంఘాల నాయకులతో సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించారు. మినిస్టర్ క్వార్టర్స్‌లో జరిగిన ఈ భేటీలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, కార్మిక సంఘాల ఎన్నికలు నిర్వహించడం, ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించిన ఇతర అంశాలు ప్రధానంగా ప్రస్తావనకు వచ్చాయి. ఇటీవల ఆర్టీసీ కార్మికుల సమస్యలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. తమ సమస్యలకు పరిష్కారం చూపాలని, అలాగే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ గత నెలలో ఆర్టీసీ జేఏసీ బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ ఉద్యమం తర్వాత ప్రభుత్వం కూడా స్పందించి సంఘాలతో చర్చలకు ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో మే 1న ఆర్టీసీ యూనియన్ నేతలు ముఖ్యమంత్రి రేవంత్ తో సమావేశమయ్యారు. ఆ సందర్భంగా సీఎం యూనియన్ నాయకుల ముందుకు రెండు ప్రత్యామ్నాయాలను ఉంచినట్లు తెలిసింది. యూనియన్లకు ఎన్నికలు కావాలా లేదా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలా అన్న విషయంలో స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. దీనిపై జేఏసీ నాయకులు ఏకగ్రీవంగా స్పందిస్తూ, యూనియన్ ఎన్నికల కంటే విలీనానికే ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపినట్లు సమాచారం. ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి తాము సహకరిస్తామని కూడా వారు వెల్లడించారు.
అదే సమయంలో రవాణాశాఖ మంత్రి స్థాయిలో చర్చలు జరిగితే తదుపరి ప్రక్రియ ముందుకు సాగుతుందని సీఎం స్పష్టం చేసిన నేపథ్యంలో, ఇవాళ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో జరిగిన సమావేశం రాజకీయంగా మరియు కార్మిక వర్గాల్లో ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ చర్చల అనంతరం ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం త్వరలో స్పష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ఉద్యోగుల డిమాండ్లపై సానుకూలంగా స్పందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, వాటి అమలుకు సంబంధించి చర్చలను వేగవంతం చేస్తోంది. ఈ క్రమంలో రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ సంఘాల నాయకులతో సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించారు. మినిస్టర్ క్వార్టర్స్‌లో జరిగిన ఈ భేటీలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, కార్మిక సంఘాల ఎన్నికలు నిర్వహించడం, ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించిన ఇతర అంశాలు ప్రధానంగా ప్రస్తావనకు వచ్చాయి. ఇటీవల ఆర్టీసీ కార్మికుల సమస్యలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. తమ సమస్యలకు పరిష్కారం చూపాలని, అలాగే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ గత నెలలో ఆర్టీసీ జేఏసీ బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ ఉద్యమం తర్వాత ప్రభుత్వం కూడా స్పందించి సంఘాలతో చర్చలకు ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో మే 1న ఆర్టీసీ యూనియన్ నేతలు ముఖ్యమంత్రి రేవంత్ తో సమావేశమయ్యారు. ఆ సందర్భంగా సీఎం యూనియన్ నాయకుల ముందుకు రెండు ప్రత్యామ్నాయాలను ఉంచినట్లు తెలిసింది. యూనియన్లకు ఎన్నికలు కావాలా లేదా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలా అన్న విషయంలో స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. దీనిపై జేఏసీ నాయకులు ఏకగ్రీవంగా స్పందిస్తూ, యూనియన్ ఎన్నికల కంటే విలీనానికే ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపినట్లు సమాచారం. ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి తాము సహకరిస్తామని కూడా వారు వెల్లడించారు.

