Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Rukmini Vasanth :  ఆ బికినీ ఫోటో నాది కాదు - రుక్మిణి వసంత్

Rukmini Vasanth : ఆ బికినీ ఫోటో నాది కాదు - రుక్మిణి వసంత్

TV5 News 8 hrs ago

By - TV5 Entertainment |23 May 2026 4:26 PM IST

ఈ మధ్య ఏఐ వచ్చిన తర్వాత ఏది నిజమో.. ఏది అబద్ధమో తెలియకుండా పోయింది. కొన్నిసార్లు కొన్ని విషయాలు నిజమే అయినా అవి ఏఐ క్రియేట్ చేసినవి అని అబద్దాలు చెబుతుంటారు కొందరు.

కానీ కొందరు మాత్రమే నిజమైన ఏఐ వీడియోలు, ఫోటోస్ బారిన పడుతుంటారు. తాజాగా రుక్మిణి వసంత్ ఇలాంటి ఫేక్ క్రియేషన్ బారిన పడింది... అని తను చెబుతోంది. తాజాగా కొందరు ఆమె బికినీ వీడియోస్, ఫోటోస్ అంటూ సడెన్ గా సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో అవన్నీ నిజం కాదు అని మండి పడుతోంది రుక్మిణి. 'అవి తనవి కాదని, ఏఐ సాంకేతికతతో సృష్టించిన నకిలీ ఫొటోలు. తన ప్రతిష్టను దిగజార్చేలా చేస్తున్న ఈ చర్యపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. సదరు ఏఐ ఫోటోస్ తో తన ఇమేజ్ ను డామేజ్ చేసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధం'అని చెబుతోంది రుక్మిణి వసంత్.

రుక్మిణి వసంత్ కెరీర్ చూస్తే టాక్సిక్ మూవీలో ఓ కీలక పాత్ర చేసింది. యశ్ హీరోగా నటించిన మూవీ ఇది. మామూలుగా అయితే ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది. తర్వాత జూన్ 4న విడుదల అన్నారు. ఆ డేట్ నుంచి కూడా వాయిదా వేశారు. తర్వాత ఎన్టీఆర్ హీరోగా నటిస్తోన్న డ్రాగన్ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. రీసెంట్ గా విడుదలైన డ్రాగన్ గ్లింప్స్ లో తను కూడా కీలకంగా కనిపించింది. మొత్తంగా తన బికినీ ఫోటోస్ అన్నీ ఏఐ క్రియేషనే అని తేల్చింది. ఇవన్నీ క్రియేట్ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఈ మధ్య ఏఐ వచ్చిన తర్వాత ఏది నిజమో.. ఏది అబద్ధమో తెలియకుండా పోయింది. కొన్నిసార్లు కొన్ని విషయాలు నిజమే అయినా అవి ఏఐ క్రియేట్ చేసినవి అని అబద్దాలు చెబుతుంటారు కొందరు. కానీ కొందరు మాత్రమే నిజమైన ఏఐ వీడియోలు, ఫోటోస్ బారిన పడుతుంటారు. తాజాగా రుక్మిణి వసంత్ ఇలాంటి ఫేక్ క్రియేషన్ బారిన పడింది... అని తను చెబుతోంది. తాజాగా కొందరు ఆమె బికినీ వీడియోస్, ఫోటోస్ అంటూ సడెన్ గా సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో అవన్నీ నిజం కాదు అని మండి పడుతోంది రుక్మిణి. 'అవి తనవి కాదని, ఏఐ సాంకేతికతతో సృష్టించిన నకిలీ ఫొటోలు. తన ప్రతిష్టను దిగజార్చేలా చేస్తున్న ఈ చర్యపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. సదరు ఏఐ ఫోటోస్ తో తన ఇమేజ్ ను డామేజ్ చేసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధం'అని చెబుతోంది రుక్మిణి వసంత్.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: TV5 Telugu