By - TV5 Entertainment |18 May 2026 12:24 PM IST
దర్శకుల్లో చాలామంది మంచి దర్శకులు అనిపించుకుంటారు. కానీ వారి కెరీర్ గ్రాఫ్ మాత్రం అంత మంచిగా ఉండదు.
వైవిధ్యమైన కథలు తీసుకుంటారు. డిఫరెంట్ గా ప్రజెంట్ చేస్తారు. హిట్స్ పడుతుంటాయి. అయినా వారి రేంజ్ మారదు. అలాంటి దర్శకుల్లో సాగర్ కే చంద్ర ఒకడు. ఫస్ట్ మూవీ అయ్యారే తో చాలామందిని ఆకట్టుకున్నాడు. తర్వాత 2016లో అప్పట్లో ఒకడుండేవాడుతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇలాంటి మంచి మూవీతో వచ్చాడు కాబట్టి కెరీర్ పరుగులు పెడుతుంది అనుకున్నారు చాలామంది. బట్ అలాంటిదేం జరగలేదు. తర్వాత మూవీ రావడానికి చాలా టైమ్ పట్టింది. 2022లో వచ్చిన భీమ్లా నాయక్ తో దర్శకుడుగా ఆకట్టుకున్నాడు. కమర్షియల్ గా కూడా మంచి విజయం సాధించిందా మూవీ. ఆ తర్వాత వెంటనే మరో మూవీకి కమిట్ అయ్యాడు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా టైసన్ నాయుడు అనే మూవీ స్టార్ట్ చేశాడు. మూడు నాలుగేళ్లు అవుతోంది ఈ మూవీ స్టార్ట్ అయ్యి. మరి ఏమైందో కానీ టైసన్ నాయుడు ముందుకు కదలడం లేదు. ఆ మధ్య ఒకానొక బెల్లంకొండ బర్త్ డే స్పెషల్ గా విడుదల చేసిన టీజర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. బట్ ఈ మూవీ ఎందుకు ఆలస్యం అవుతుంది అనేది ఎవరికీ తెలియకుండా పోయింది. ఇవాళ సాగర్ కే చంద్ర బర్త్ డే. ఇవాళ బర్త్ డే స్పెషల్ గా పోస్టర్ వచ్చింది. కానీ మూవీ అప్డేట్ మాత్రం రాలేదు. మరి ఇలా ఎందుకు జరుగుతుందో తెలియకుండా పోయింది.
మామూలుగా సాగర్ కే చంద్ర యూఎస్ రిటర్న్స్. అక్కడ మంచి జాబ్ వదులుకున్నాడు. సినిమా ఇండస్ట్రీలోకి రావాలని ప్రయత్నించాడు. అందులో భాగంగా రవిబాబు నటించిన అమరావతి మూవీకి అసిస్టెంట్ గా వర్క్ చేశాడు. ఇంకొన్ని మూవీస్ కు కూడా పనిచేశాడు. ఫైనల్ గా 2012లో వచ్చిన అయ్యారేతో చాలామందిని ఆకట్టుకున్నాడు. మిగతాదంతా తెలిసిందే. బట్ టైసన్ నాయుడు విషయంలో మాత్రం ఇంత ఎందుకు ఆలస్యం అవుతుంది అనేది మాత్రం తెలియకుండా పోయింది. బెల్లంకొండ శ్రీనివాస్ దీని తర్వాత కమిట్ అయిన మూవీస్ రెండు విడుదల చేశాడు కూడా. అయినా టైసన్ నాయుడుకు మోక్షం రావడం లేదు. మరి ఈ మూవీ పూర్తిగా ఆపేశారా లేక ప్రస్తుతం హోల్డ్ లో ఉందా అనేది తెలియదు. చూద్దాం.. ఇప్పటికైనే ఈ మూవీ రిలీజ్ వరకు అయినా వెళ్తుందా లేదా అనేది.
దర్శకుల్లో చాలామంది మంచి దర్శకులు అనిపించుకుంటారు. కానీ వారి కెరీర్ గ్రాఫ్ మాత్రం అంత మంచిగా ఉండదు. వైవిధ్యమైన కథలు తీసుకుంటారు. డిఫరెంట్ గా ప్రజెంట్ చేస్తారు. హిట్స్ పడుతుంటాయి. అయినా వారి రేంజ్ మారదు. అలాంటి దర్శకుల్లో సాగర్ కే చంద్ర ఒకడు. ఫస్ట్ మూవీ అయ్యారే తో చాలామందిని ఆకట్టుకున్నాడు. తర్వాత 2016లో అప్పట్లో ఒకడుండేవాడుతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇలాంటి మంచి మూవీతో వచ్చాడు కాబట్టి కెరీర్ పరుగులు పెడుతుంది అనుకున్నారు చాలామంది. బట్ అలాంటిదేం జరగలేదు. తర్వాత మూవీ రావడానికి చాలా టైమ్ పట్టింది. 2022లో వచ్చిన భీమ్లా నాయక్ తో దర్శకుడుగా ఆకట్టుకున్నాడు. కమర్షియల్ గా కూడా మంచి విజయం సాధించిందా మూవీ. ఆ తర్వాత వెంటనే మరో మూవీకి కమిట్ అయ్యాడు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా టైసన్ నాయుడు అనే మూవీ స్టార్ట్ చేశాడు. మూడు నాలుగేళ్లు అవుతోంది ఈ మూవీ స్టార్ట్ అయ్యి. మరి ఏమైందో కానీ టైసన్ నాయుడు ముందుకు కదలడం లేదు. ఆ మధ్య ఒకానొక బెల్లంకొండ బర్త్ డే స్పెషల్ గా విడుదల చేసిన టీజర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. బట్ ఈ మూవీ ఎందుకు ఆలస్యం అవుతుంది అనేది ఎవరికీ తెలియకుండా పోయింది. ఇవాళ సాగర్ కే చంద్ర బర్త్ డే. ఇవాళ బర్త్ డే స్పెషల్ గా పోస్టర్ వచ్చింది. కానీ మూవీ అప్డేట్ మాత్రం రాలేదు. మరి ఇలా ఎందుకు జరుగుతుందో తెలియకుండా పోయింది.

