By - Sathwik |22 May 2026 12:00 PM IST
హైదరాబాద్-బెంగళూరు మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపులు- మెట్రో టైం పెంపు
క్రికెట్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ హై-వోల్టేజ్ పోరుకు హైదరాబాద్ సిద్ధమైంది.
ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్న నేపథ్యంలో నగరంలో ఇప్పటికే మ్యాచ్ ఫీవర్ కనిపిస్తోంది. రెండు జట్లకు ఈ మ్యాచ్ కీలకంగా మారడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. స్టేడియానికి పెద్ద ఎత్తున ప్రేక్షకులు తరలివచ్చే అవకాశాల దృష్ట్యా అధికారులు కూడా ప్రత్యేక ఏర్పాట్లపై దృష్టి సారించారు. ముఖ్యంగా మ్యాచ్ ముగిసిన తర్వాత అభిమానులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రవాణా సదుపాయాలను మెరుగుపరిచేందుకు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ క్రికెట్ అభిమానులకు కీలక ప్రకటన చేసింది. మ్యాచ్ కారణంగా భారీ సంఖ్యలో ప్రేక్షకులు స్టేడియానికి చేరుకుంటారని అంచనా వేస్తున్న అధికారులు, ప్రయాణికుల సౌకర్యార్థం మెట్రో సేవల సమయాన్ని పొడిగించాలని నిర్ణయించారు. సాధారణంగా రాత్రి సమయాల్లో మెట్రో సర్వీసులు ముగిసే సమయానికి మ్యాచ్ పూర్తవుతుండటంతో అభిమానులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతోంది. దీనికి పరిష్కారంగా అర్ధరాత్రి 12 గంటల వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉండనున్నట్లు అధికారులు వెల్లడించారు.
ట్రాఫిక్ మళ్లింపు
మ్యాచ్ ముగిసిన వెంటనే ఉప్పల్, స్టేడియం మెట్రో స్టేషన్ల వద్ద భారీగా ప్రయాణికుల రద్దీ ఉండే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు. దీంతో ప్రయాణికులు క్యూల్లో ఎక్కువసేపు వేచి ఉండాల్సిన పరిస్థితులు తలెత్తకుండా ముందస్తుగా రిటర్న్ జర్నీ టికెట్లు తీసుకోవాలని సూచించారు. అలాగే స్మార్ట్ కార్డులు, డిజిటల్ క్యూ ఆర్ టికెట్లను వినియోగించడం ద్వారా సమయం ఆదా చేసుకోవచ్చని తెలిపారు. మరోవైపు స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఒత్తిడి పెరిగే అవకాశం ఉండటంతో, సాధ్యమైనంత వరకు ప్రజలు వ్యక్తిగత వాహనాల కంటే మెట్రో వంటి ప్రజా రవాణా సదుపాయాలను వినియోగించాలని రవాణా శాఖ సూచించింది. మ్యాచ్ సందడి మధ్య మరో అంశం కూడా చర్చనీయాంశంగా మారింది. ఉప్పల్‌లో జరగనున్న ఈ కీలక మ్యాచ్ టికెట్ల కోసం అభిమానుల్లో భారీ డిమాండ్ నెలకొనడంతో కొంతమంది అక్రమంగా బ్లాక్ టికెట్ల విక్రయానికి పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆన్‌లైన్‌లో టికెట్లు ప్రారంభమైన కొద్దిసేపటికే పూర్తిగా అమ్ముడుపోయినట్లు కనిపించడంతో పలువురు అభిమానులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని అసలు ధరల కంటే ఎక్కువకు టికెట్లు విక్రయిస్తున్నారనే విమర్శలు సోషల్ మీడియాలో కూడా వ్యక్తమవుతున్నాయి.
ఈ వ్యవహారంపై హైదరాబాద్ పోలీసులు తీవ్రంగా స్పందించారు. బ్లాక్‌లో టికెట్లు అమ్మడం లేదా నకిలీ టికెట్లతో మోసాలకు పాల్పడడం వంటి చర్యలపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్న కొందరిని గుర్తించి కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. మరోవైపు మ్యాచ్ సందర్భంగా ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా కొన్ని వాహనాలకు పరిమితులు విధించారు. ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు నాగోల్ నుంచి హబ్సిగూడ మార్గం, అలాగే బోడుప్పల్ నుంచి అంబర్‌పేట్ మార్గంలో ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. లారీలు, డంపర్లు, ట్రక్కులు, టిప్పర్లు, ప్రైవేట్ బస్సులు, ఇతర భారీ వాహనాలు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని సూచించారు. ప్రజలు తమ ప్రయాణాలకు సాధ్యమైనంత వరకు ఆర్టీసీ బస్సులు, మెట్రో రైళ్లను వినియోగించడం ద్వారా ఇబ్బందులను తగ్గించుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు.
క్రికెట్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ హై-వోల్టేజ్ పోరుకు హైదరాబాద్ సిద్ధమైంది. ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్న నేపథ్యంలో నగరంలో ఇప్పటికే మ్యాచ్ ఫీవర్ కనిపిస్తోంది. రెండు జట్లకు ఈ మ్యాచ్ కీలకంగా మారడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. స్టేడియానికి పెద్ద ఎత్తున ప్రేక్షకులు తరలివచ్చే అవకాశాల దృష్ట్యా అధికారులు కూడా ప్రత్యేక ఏర్పాట్లపై దృష్టి సారించారు. ముఖ్యంగా మ్యాచ్ ముగిసిన తర్వాత అభిమానులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రవాణా సదుపాయాలను మెరుగుపరిచేందుకు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ క్రికెట్ అభిమానులకు కీలక ప్రకటన చేసింది. మ్యాచ్ కారణంగా భారీ సంఖ్యలో ప్రేక్షకులు స్టేడియానికి చేరుకుంటారని అంచనా వేస్తున్న అధికారులు, ప్రయాణికుల సౌకర్యార్థం మెట్రో సేవల సమయాన్ని పొడిగించాలని నిర్ణయించారు. సాధారణంగా రాత్రి సమయాల్లో మెట్రో సర్వీసులు ముగిసే సమయానికి మ్యాచ్ పూర్తవుతుండటంతో అభిమానులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతోంది. దీనికి పరిష్కారంగా అర్ధరాత్రి 12 గంటల వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉండనున్నట్లు అధికారులు వెల్లడించారు.
ట్రాఫిక్ మళ్లింపు
ట్రాఫిక్ మళ్లింపు
ట్రాఫిక్ మళ్లింపు

