By - TV5 Entertainment |19 May 2026 4:03 PM IST
సుడిగాలి సుధీర్.. బుల్లితెర మెగాస్టార్ గా చెప్పుకుంటారు అతని అభిమానులు. చాలా తక్కువ స్థాయి నుంచి బాగా ఎదిగాడు.
టివిల్లో తన ఇమేజ్ గురించి ఎన్ని సెటైర్స్ వేసినా.. ఎంత గాలి తీసినా అంతా కామ్ గా ఉండిపోతుంటాడు. అదంతా కేవలం జనాల్ని నవ్వించడానికి మాత్రమే అని వినయంగా చెబుతుంటాడు. ప్రస్తుతం చాలా టివి షోస్ చాలా చాలా బిజీగా ఉన్నాడు. అలాంటి సుధీర్ సడెన్ గా జోకర్ అయ్యాడు అంటే పెద్ద విషయమేం కాదు. ఎందుకంటే జోకర్ అంటే అది అతన్ని కించపరిచేందుకు కాదు. అతను నటించిన ఓ మూవీ టైటిల్ అది. ఆ టైటిల్ తో పాటు ఈ మూవీ టీజర్ ను కూడా విడుదల చేసింది మూవీ టీమ్. ఈ టీజర్ చూడగానే ఆకట్టుకునేలా ఉంది.
పరదా మూవీ నిర్మించిన వాళ్లే ఈ జోకర్ చిత్రాన్ని నిర్మించారు. టీజర్ చూస్తే.. ఓరియబ్బడాలా.. రాయల్ ఫ్యామిలీలో పుట్టి దొంగతనాలేంటి మాస్టారూ అంటూ అజయ్ ఘోష్ సీన్ తో స్టార్ట్ అవుతుంది. ఆ రాయల్ ఫ్యామిలీకి చెందిన వాడే సుధీర్. చాలామందికి డబ్బులు, డ్రగ్స్, అమ్మాయిలు కిక్ ఇస్తాయి.. కానీ వాడు కింగ్ అనే ఫీలింగ్ వాడికి కిక్ ఇస్తాయి.. అంటూ మురళీ శర్మ సీన్ తో కంటిన్యూ అవుతుంది. అలాంటి ఒక రాయల్ ఫ్యామిలీ నుంచి దొంగతనాల వరకు ఎందుకు వెళ్లాడు అనేది ఈ మూవీలోని మెయిన్ పాయింట్ లా ఉంది. 'నేనేదైనా గెలుస్తా అని డిసైడ్ అయిన తర్వాతే దిగుతా'అనేది సుధీర్ డైలాగ్ బావుంది. దాన్ని బట్టి అతను ఈ మూవీలో ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నాడు అనేది తెలుస్తుంది.
మొత్తంగా ఇవాళ సుడిగాలి సుధీర్ బర్త్ డే. ఈ సందర్భంగానే ఈ టీజర్ విడుదల చేశారు. హీరోయిన్ గా అయేషా నటిస్తోంది. మురళీ శర్మ, అజయ్ ఘోష్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. పిఎస్ సునిల్ పుప్పాల డైరెక్ట్ చేస్తోన్న మూవీ ఇది.
సుడిగాలి సుధీర్.. బుల్లితెర మెగాస్టార్ గా చెప్పుకుంటారు అతని అభిమానులు. చాలా తక్కువ స్థాయి నుంచి బాగా ఎదిగాడు. టివిల్లో తన ఇమేజ్ గురించి ఎన్ని సెటైర్స్ వేసినా.. ఎంత గాలి తీసినా అంతా కామ్ గా ఉండిపోతుంటాడు. అదంతా కేవలం జనాల్ని నవ్వించడానికి మాత్రమే అని వినయంగా చెబుతుంటాడు. ప్రస్తుతం చాలా టివి షోస్ చాలా చాలా బిజీగా ఉన్నాడు. అలాంటి సుధీర్ సడెన్ గా జోకర్ అయ్యాడు అంటే పెద్ద విషయమేం కాదు. ఎందుకంటే జోకర్ అంటే అది అతన్ని కించపరిచేందుకు కాదు. అతను నటించిన ఓ మూవీ టైటిల్ అది. ఆ టైటిల్ తో పాటు ఈ మూవీ టీజర్ ను కూడా విడుదల చేసింది మూవీ టీమ్. ఈ టీజర్ చూడగానే ఆకట్టుకునేలా ఉంది.

