Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
SUMMER: నిప్పుల కుంపటిని తలపించిన తెలుగు రాష్ట్రాలు

SUMMER: నిప్పుల కుంపటిని తలపించిన తెలుగు రాష్ట్రాలు

TV5 News 3 days ago

By - Sathwik |21 May 2026 7:15 PM IST

పిడుగురాళ్లలో 48.1... మునగాలలో 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత

వేసవి ఉక్కపోతతో తెలుగు రాష్ట్రాలు అగ్నిగుండంలా మారుతున్నాయి.

రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఉదయం నుంచే మండుతున్న ఎండలు మధ్యాహ్నానికి భరించలేని స్థాయికి చేరుకుంటుండటంతో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. ఎండల తీవ్రత కారణంగా రహదారులు నిర్మానుష్యంగా మారుతుండగా, ప్రజలు అత్యవసర పనులు మినహా బయటకు రావడాన్ని తగ్గిస్తున్నారు. వాతావరణ పరిస్థితుల్లో వచ్చిన మార్పుల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పలుచోట్ల రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరో కొన్ని రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎండల ప్రభావం మరింత తీవ్రంగా కనిపిస్తోంది. రాష్ట్రంలోని పలుచోట్ల ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకుపైగా నమోదవుతున్నాయి. అత్యధికంగా పిడుగురాళ్లలో 48.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతగా నిలిచింది. బాపట్ల జిల్లా వేటపాలెంలో, కృష్ణా జిల్లా నందివాడలో 47.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎన్టీఆర్ జిల్లా తొర్రగుడిపాడు, ప్రకాశం జిల్లా అద్దంకిలో 47.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఏలూరు జిల్లా అల్లిపల్లిలో 47.3 డిగ్రీలు నమోదవగా, మార్కాపురం పరిధిలోని నందనమారెళ్లలో 46.6 డిగ్రీలు నమోదయ్యాయి. అలాగే పోలవరం పరిధిలోని కూనవరం 46.5 డిగ్రీలు, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో 46.4 డిగ్రీలు, గుంటూరు జిల్లా తెనాలిలో 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

రాష్ట్రంలో 18 జిల్లాల్లో 45 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే 20 జిల్లాల్లోని సుమారు 200 మండలాల్లో 44 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వెల్లడించారు. మరోవైపు తెలంగాణలో కూడా ఎండల ప్రభావం తీవ్రంగానే ఉంది. పెద్దపల్లి జిల్లా ముత్తారంలో 46.5 డిగ్రీలు, సూర్యాపేట జిల్లా మునగాలలో 46.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లిలో 46.4 డిగ్రీలు, మహబూబాబాద్ జిల్లా కురవిలో 46.3 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా జైనథ్‌లో 46.2 డిగ్రీలు, సిద్దిపేట జిల్లా అక్కన్నపేట్‌లో 46.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. తెలంగాణలోని 20 జిల్లాల్లో 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని అధికారులు పేర్కొన్నారు. సోమవారం వరకు ఎండల తీవ్రత కొనసాగవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది.

వేసవి ఉక్కపోతతో తెలుగు రాష్ట్రాలు అగ్నిగుండంలా మారుతున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఉదయం నుంచే మండుతున్న ఎండలు మధ్యాహ్నానికి భరించలేని స్థాయికి చేరుకుంటుండటంతో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. ఎండల తీవ్రత కారణంగా రహదారులు నిర్మానుష్యంగా మారుతుండగా, ప్రజలు అత్యవసర పనులు మినహా బయటకు రావడాన్ని తగ్గిస్తున్నారు. వాతావరణ పరిస్థితుల్లో వచ్చిన మార్పుల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పలుచోట్ల రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరో కొన్ని రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎండల ప్రభావం మరింత తీవ్రంగా కనిపిస్తోంది. రాష్ట్రంలోని పలుచోట్ల ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకుపైగా నమోదవుతున్నాయి. అత్యధికంగా పిడుగురాళ్లలో 48.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతగా నిలిచింది. బాపట్ల జిల్లా వేటపాలెంలో, కృష్ణా జిల్లా నందివాడలో 47.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎన్టీఆర్ జిల్లా తొర్రగుడిపాడు, ప్రకాశం జిల్లా అద్దంకిలో 47.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఏలూరు జిల్లా అల్లిపల్లిలో 47.3 డిగ్రీలు నమోదవగా, మార్కాపురం పరిధిలోని నందనమారెళ్లలో 46.6 డిగ్రీలు నమోదయ్యాయి. అలాగే పోలవరం పరిధిలోని కూనవరం 46.5 డిగ్రీలు, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో 46.4 డిగ్రీలు, గుంటూరు జిల్లా తెనాలిలో 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: TV5 Telugu