Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Suriya :  సూర్య మూవీ రిలీజ్ కాలేదు

Suriya : సూర్య మూవీ రిలీజ్ కాలేదు

TV5 News 1 week ago

By - TV5 Entertainment |14 May 2026 2:34 PM IST

తమిళ్ స్టార్ సూర్య హీరోగా నటించిన మూవీ కరుప్పు. ఈ చిత్రాన్నితెలుగులో వీరభద్రుడు అనే టైటిల్ తో విడుదల చేయాలనుకున్నారు.

ఇవాళ విడుదల కావాల్సిన మూవీ ఇది. బట్ తమిళ్ లోనే ఈ మూవీ విడుదల కాలేదు. ఆర్థికపరమైన సమస్యల వల్ల ఈ చిత్రాన్ని ఇవాళ రిలీజ్ చేయలేదు. ఓ రకంగా ఈ మూవీ చాలా రోజులుగా ఇబ్బంది పడుతూనే ఉంది. తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి విజయ్ కొంత భరోసా ఇచ్చినా గానీ ఈ మూవీ రిలీజ్ కాలేదు. సాయంత్రం వరకు అన్ని ప్లాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేసి.. ఫస్ట్ షో నుంచి రిలీజ్ అవుతుందని చెబుతున్నారు. కానీ అది కూడా గ్యారెంటీ కాదు. ఓ రకంగా చూస్తే ఈ మూవీ రేపే విడుదలయ్యే అవకాశాలున్నాయి.

కొన్నాళ్లుగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న సూర్యకు ఇలాంటి ప్రాబ్లమ్ అంటే పెద్ద విషయమే. మామూలుగా ఈ మూవీపై ఏమంత బజ్ లేదు. హైప్ కూడా లేదు. ఓపెనింగ్స్ కూడా బిలో యావరేజ్ గా ఉన్నాయి. ఇలాంటి టైమ్ లో ఏకంగా విడుదల కావడమే ఆలస్యం అంటే సమస్యే. సూర్యతో పాటు త్రిష హీరోయిన్ గా నటించింది. ఆర్జే బాలాజీ డైరెక్ట్ చేసిన మూవీ ఇది. ఆర్జే బాలాజీ ఈ చిత్రంలో విలన్ పాత్రలోనూ నటించాడు. మరి సాయంత్రం వరకు అంతా సెట్ అవుతుందని చెబుతున్నారు. సెట్ అవుతుందా లేక ఇంకేదైనా సమస్య ఉందా అనేది చూడాలి.

తమిళ్ స్టార్ సూర్య హీరోగా నటించిన మూవీ కరుప్పు. ఈ చిత్రాన్నితెలుగులో వీరభద్రుడు అనే టైటిల్ తో విడుదల చేయాలనుకున్నారు. ఇవాళ విడుదల కావాల్సిన మూవీ ఇది. బట్ తమిళ్ లోనే ఈ మూవీ విడుదల కాలేదు. ఆర్థికపరమైన సమస్యల వల్ల ఈ చిత్రాన్ని ఇవాళ రిలీజ్ చేయలేదు. ఓ రకంగా ఈ మూవీ చాలా రోజులుగా ఇబ్బంది పడుతూనే ఉంది. తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి విజయ్ కొంత భరోసా ఇచ్చినా గానీ ఈ మూవీ రిలీజ్ కాలేదు. సాయంత్రం వరకు అన్ని ప్లాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేసి.. ఫస్ట్ షో నుంచి రిలీజ్ అవుతుందని చెబుతున్నారు. కానీ అది కూడా గ్యారెంటీ కాదు. ఓ రకంగా చూస్తే ఈ మూవీ రేపే విడుదలయ్యే అవకాశాలున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: TV5 Telugu