Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
TERROR:పాక్ ఐఎస్ఐతో నిరంతర సంప్రదింపులు

TERROR:పాక్ ఐఎస్ఐతో నిరంతర సంప్రదింపులు

TV5 News 4 days ago

By - Sathwik |25 May 2026 3:00 PM IST

హైదరాబాద్ లో యువకుడి అరెస్ట్

పా­కి­స్థా­న్‌ నిఘా సం­స్థ ఐఎ­స్‌ఐ (ISI) మద్ద­తు­న్న ఒక ము­ఠా­తో ని­రం­త­రం సం­ప్ర­దిం­పు­లు జరు­పు­తు­న్న జయీ­ద్‌­ఖా­న్‌ అనే 22 ఏళ్ల యు­వ­కు­డి­ని హై­ద­రా­బా­ద్ లో అరె­స్ట్ చే­శా­రు.

ఉత్త­ర­ప్ర­దే­శ్‌­లో­ని ఘా­జి­యా­బా­ద్‌­కు చెం­దిన 22 ఏళ్ల జయీ­ద్ ఖాన్ ఈ ఏడా­ది ఫి­బ్ర­వ­రి­లో ఉపా­ధి కోసం హై­ద­రా­బా­ద్ నగ­రా­ని­కి వచ్చా­డు. అనం­త­రం మే­డ్చ­ల్ ప్రాం­తం­లో­ని ము­బా­ర­క్ రె­స్టా­రెం­ట్‌­లో సర్వ­ర్‌­గా ఉద్యో­గం­లో చే­రా­డు. ఉద్యోగ సమయం మి­న­హా మి­గి­లిన సమ­యం­లో సో­ష­ల్ మీ­డి­యా­లో చు­రు­కు­గా ఉండే అతడు, ఇన్‌­స్టా­గ్రా­మ్‌­లో రీ­ల్స్ రూ­పొం­దిం­చి పో­స్టు చే­స్తుం­డే­వా­డు. ము­ఖ్యం­గా రెం­డు బొ­మ్మ తు­పా­కు­ల­తో చే­సిన వీ­డి­యో­ల­కు మంచి స్పం­దన రా­వ­డం­తో అదే తరహా వీ­డి­యో­ల­ను మరిం­త­గా రూ­పొం­దిం­చ­డం ప్రా­రం­భిం­చి­న­ట్లు పో­లీ­సు­లు గు­ర్తిం­చా­రు.

కీలక ఆధారాలు లభ్యం

ఇలాం­టి వీ­డి­యో­లే పా­కి­స్థా­న్‌­కు చెం­దిన ఐఎ­స్‌ఐ సా­ను­భూ­తి­ప­రుల దృ­ష్టి­ని ఆక­ర్షిం­చి­న­ట్లు దర్యా­ప్తు­లో తే­లిం­ది. హబీ­బ్, రాణా హు­స్సే­న్ అనే వ్య­క్తు­లు మొదట అతడి పో­స్టు­ల­కు లై­క్‌­లు, కా­మెం­ట్లు చే­స్తూ పరి­చ­యం పెం­చు­కు­న్నా­రు. తర్వాత ఐఎ­స్‌ఐ కీలక సభ్యు­డి­గా భా­వి­స్తు­న్న షహ­బా­ద్ ఆదే­శాల మే­ర­కు ఇన్‌­స్టా­గ్రా­మ్ ద్వా­రా నే­రు­గా అత­డి­తో సం­భా­ష­ణ­లు ప్రా­రం­భిం­చి­న­ట్లు అధి­కా­రు­లు వె­ల్ల­డిం­చా­రు. మొదట స్నే­హ­పూ­ర్వ­కం­గా మా­ట్లా­డిన వారు, ఆ తర్వాత అస­లైన ఆయు­ధా­లు పం­పి­స్తా­మ­ని ఆశ చూ­పి­స్తూ అత­డి­ని ప్ర­భా­వి­తం చే­సేం­దు­కు ప్ర­య­త్నిం­చి­న­ట్లు వి­చా­ర­ణ­లో బయ­ట­ప­డిం­ది. ప్రా­థ­మిక వి­చా­ర­ణ­లో జయీ­ద్ ఖాన్ కూడా వా­రి­కి ఆక­ర్షి­తు­డై, అవ­కా­శం వస్తే పా­కి­స్థా­న్‌­కు కూడా రా­వ­డా­ని­కి సి­ద్ధ­మ­ని చా­టిం­గ్‌­లో పే­ర్కొ­న్న­ట్లు అధి­కా­రు­లు తె­లి­పా­రు. ఇదే సమ­యం­లో అతడి సో­ష­ల్ మీ­డి­యా కా­ర్య­క­లా­పా­లు, అను­మా­నా­స్పద కద­లి­క­ల­ను కేం­ద్ర భద్ర­తా సం­స్థ­లు గమ­నిం­చి మే­డ్చ­ల్ పో­లీ­సు­ల­ను అప్ర­మ­త్తం చే­శా­యి. పో­లీ­సు­లు జయీ­ద్ ఖా­న్‌­ను అదు­పు­లో­కి తీ­సు­కు­ని అతడి గది­ని తని­ఖీ చే­శా­రు. అక్కడ రెం­డు నకి­లీ తు­పా­కు­లు, సె­ల్‌­ఫో­న్ స్వా­ధీ­నం చే­సు­కు­న్నా­రు. ఫోన్ పరిశీలనలో ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి పాక్ ఐఎస్‌ఐ ముఠా సభ్యులతో జరిగిన వాట్సాప్ చాటింగ్‌లు, వాయిస్ కాల్స్, స్క్రీన్‌షాట్‌లు లభించినట్లు అధికారులు తెలిపారు. మరిన్ని వివరాల కోసం మొబైల్ ఫోన్‌ను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారు. కోర్టు అతడికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో చర్లపల్లి జైలుకు తరలించారు. పాక్ ఐఎస్‌ఐతో సంబంధాల తీవ్రత, ఇతర ఉగ్రవాద సంస్థలతో ఎలాంటి అనుబంధం ఉందా అనే అంశాలపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

పా­కి­స్థా­న్‌ నిఘా సం­స్థ ఐఎ­స్‌ఐ (ISI) మద్ద­తు­న్న ఒక ము­ఠా­తో ని­రం­త­రం సం­ప్ర­దిం­పు­లు జరు­పు­తు­న్న జయీ­ద్‌­ఖా­న్‌ అనే 22 ఏళ్ల యు­వ­కు­డి­ని హై­ద­రా­బా­ద్ లో అరె­స్ట్ చే­శా­రు. ఉత్త­ర­ప్ర­దే­శ్‌­లో­ని ఘా­జి­యా­బా­ద్‌­కు చెం­దిన 22 ఏళ్ల జయీ­ద్ ఖాన్ ఈ ఏడా­ది ఫి­బ్ర­వ­రి­లో ఉపా­ధి కోసం హై­ద­రా­బా­ద్ నగ­రా­ని­కి వచ్చా­డు. అనం­త­రం మే­డ్చ­ల్ ప్రాం­తం­లో­ని ము­బా­ర­క్ రె­స్టా­రెం­ట్‌­లో సర్వ­ర్‌­గా ఉద్యో­గం­లో చే­రా­డు. ఉద్యోగ సమయం మి­న­హా మి­గి­లిన సమ­యం­లో సో­ష­ల్ మీ­డి­యా­లో చు­రు­కు­గా ఉండే అతడు, ఇన్‌­స్టా­గ్రా­మ్‌­లో రీ­ల్స్ రూ­పొం­దిం­చి పో­స్టు చే­స్తుం­డే­వా­డు. ము­ఖ్యం­గా రెం­డు బొ­మ్మ తు­పా­కు­ల­తో చే­సిన వీ­డి­యో­ల­కు మంచి స్పం­దన రా­వ­డం­తో అదే తరహా వీ­డి­యో­ల­ను మరిం­త­గా రూ­పొం­దిం­చ­డం ప్రా­రం­భిం­చి­న­ట్లు పో­లీ­సు­లు గు­ర్తిం­చా­రు.

కీలక ఆధారాలు లభ్యం

కీలక ఆధారాలు లభ్యం

కీలక ఆధారాలు లభ్యం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: TV5 Telugu