Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
TG: బండి భగీరథ్ కేసులో బాధితురాలి తల్లి బహిరంగ లేఖ

TG: బండి భగీరథ్ కేసులో బాధితురాలి తల్లి బహిరంగ లేఖ

TV5 News 1 week ago

By - Sathwik |16 May 2026 9:30 AM IST

మానసిక క్షోభ అనుభవిస్తున్నామని ఆవేదన

పోక్సో కేసు దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో బండి భగీరథ్ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.

బాధిత బాలిక తల్లి బహిరంగ లేఖ విడుదల చేస్తూ తన కుటుంబం ఎదుర్కొంటున్న పరిస్థితులను వివరించారు. తాము సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందినవారమని, ఎలాంటి రాజకీయ లేదా ఇతర ప్రభావశక్తి తమకు లేదని పేర్కొంటూ, ప్రస్తుతం తమ కుటుంబం తీవ్ర మానసిక వేదనలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా కేసు దర్యాప్తు జరుగుతున్న సమయంలో తన కుమార్తె వ్యక్తిగత వివరాలు, ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం కావడం మరింత బాధాకరమని పేర్కొన్నారు. కేసుకు సంబంధించిన సున్నితమైన అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం వల్ల బాలిక మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

నాలుగు పేజీల బహిరంగ లేఖ

నాలుగు పేజీల బహిరంగ లేఖలో ఆమె పలు కీలక అంశాలను ప్రస్తావించారు. తన కుమార్తెకు బండి భగీరథ్‌తో 2025లో పరిచయం ఏర్పడిందని పేర్కొన్నారు. ఆ పరిచయం క్రమంగా దగ్గరైన తర్వాత నమ్మకం కలిగించే విధంగా వ్యవహరించారని, వివిధ ప్రదేశాలు, అపార్ట్‌మెంట్లకు తీసుకెళ్లారని తెలిపారు. ఈ సమయంలో తన కుమార్తె ఇష్టానికి విరుద్ధంగా ప్రవర్తించేందుకు ప్రయత్నాలు జరిగాయని ఆరోపించారు. ముఖ్యంగా 2025 డిసెంబరు 31 అర్ధరాత్రి నుంచి 2026 జనవరి 1 మధ్య జరిగిన ఘటనలను ఆమె ప్రత్యేకంగా ప్రస్తావించారు. మొయినాబాద్ ప్రాంతంలో జరిగిన సంఘటనల్లో తన కుమార్తెకు ఇష్టంలేకపోయినా మద్యం తాగించారని, అనంతరం అనుచితంగా ప్రవర్తించారని పేర్కొన్నారు. ఆ సంఘటనల తర్వాత తన కుమార్తె ప్రవర్తనలో గణనీయమైన మార్పులు కనిపించాయని ఆమె వివరించారు. జరిగిన విషయాలను గుర్తుచేసుకున్న ప్రతిసారీ తీవ్ర భయం, ఆందోళన, భావోద్వేగాలకు గురయ్యేదని తెలిపారు. తల్లిగా తన కళ్లముందే కుమార్తె తీవ్ర మానసిక వేదన అనుభవించడం తట్టుకోలేని పరిస్థితి అని పేర్కొన్నారు. సంఘటనల అనంతరం తన కుమార్తె తీవ్ర మనస్తాపంలోకి వెళ్లిందని, ముఖ్యంగా సంబంధాలు ముగిసిన తర్వాత మానసిక ఒత్తిడి మరింత పెరిగిందని లేఖలో పేర్కొన్నారు.

భయాందోళనలకు గురవుతున్నాం

తన కుమార్తె కొంతకాలం తర్వాత ఆ భయానక పరిస్థితుల నుంచి బయటపడే ప్రయత్నం చేసిందని, ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో చట్టపరమైన అవకాశాలపై ఆలోచించడం ప్రారంభించామని తెలిపారు. అయితే పరిస్థితులు ఊహించని మలుపు తిరిగాయని పేర్కొన్నారు. ఏప్రిల్ 21న తమ కుటుంబంపై బ్లాక్‌మెయిల్, ఎక్స్‌టార్షన్ ఆరోపణలు చేస్తూ ఫిర్యాదు నమోదు కావడం తమను మరింత భయాందోళనలకు గురిచేసిందని వెల్లడించారు. సాధారణ కుటుంబంగా తాము పూర్తిగా నిస్సహాయ స్థితిలో నిలిచిపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కొందరు మధ్యవర్తుల జోక్యం కూడా జరిగిందని లేఖలో వివరించారు. అనంతరం కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌ను ఆయన నివాసంలో కలిసి తమ సమస్య వివరించేందుకు ప్రయత్నించామని తెలిపారు. బాధితురాలి తల్లిదండ్రులుగా తమకు రక్షణ, సహాయం లభిస్తుందని ఆశించామని పేర్కొన్నారు. అయితే అక్కడి పరిస్థితులు తమకు మరింత భయాన్ని కలిగించాయని, తాము ఆందోళనతోనే అక్కడి నుంచి వెనుదిరిగామని వెల్లడించారు. కేసు నమోదు ప్రక్రియపై కూడా ఆమె పలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. తమ కుమార్తెపై లైంగిక వేధింపులు జరిగాయని ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన సమయంలో కావాలనే ఆలస్యం చేశారని ఆరోపించారు. మొదట తేలికపాటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారని, ప్రజల ఒత్తిడి తర్వాత మాత్రమే కఠిన సెక్షన్లు చేర్చారని పేర్కొన్నారు. దర్యాప్తు వేగంగా సాగకపోవడం వల్ల తమ కుటుంబం ఆందోళన చెందుతోందని తెలిపారు.

ఇంకా డిజిటల్ ఆధారాలను పరిరక్షించాల్సిన అవసరం ఉందని కూడా లేఖలో ప్రస్తావించారు. తన కుమార్తెకు పంపిన సందేశాలు, చాట్ వివరాలు, ఇతర డిజిటల్ సాక్ష్యాలు భద్రపరచాలని కోరారు. అవి తొలగించబడే అవకాశం ఉన్నందున వెంటనే ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే పోలీస్ స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజ్, రికార్డులు, ఇతర సాంకేతిక ఆధారాలను కూడా సంరక్షించాలని డిమాండ్ చేశారు. కేసును అసలు అంశం నుంచి దారి మళ్లించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ముఖ్యంగా బాలిక వయస్సును వివాదాస్పద అంశంగా మార్చి అసలు విషయాన్ని పక్కకు నెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. అయితే ఎంత ప్రయత్నించినా నిజాలను ఎవరూ దాచలేరని, న్యాయం జరుగుతుందనే ఆశతో తమ కుటుంబం ఎదురుచూస్తోందని లేఖలో పేర్కొన్నారు.

పోక్సో కేసు దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో బండి భగీరథ్ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బాధిత బాలిక తల్లి బహిరంగ లేఖ విడుదల చేస్తూ తన కుటుంబం ఎదుర్కొంటున్న పరిస్థితులను వివరించారు. తాము సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందినవారమని, ఎలాంటి రాజకీయ లేదా ఇతర ప్రభావశక్తి తమకు లేదని పేర్కొంటూ, ప్రస్తుతం తమ కుటుంబం తీవ్ర మానసిక వేదనలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా కేసు దర్యాప్తు జరుగుతున్న సమయంలో తన కుమార్తె వ్యక్తిగత వివరాలు, ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం కావడం మరింత బాధాకరమని పేర్కొన్నారు. కేసుకు సంబంధించిన సున్నితమైన అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం వల్ల బాలిక మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

నాలుగు పేజీల బహిరంగ లేఖ

భయాందోళనలకు గురవుతున్నాం

నాలుగు పేజీల బహిరంగ లేఖ

భయాందోళనలకు గురవుతున్నాం

నాలుగు పేజీల బహిరంగ లేఖ

భయాందోళనలకు గురవుతున్నాం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: TV5 Telugu