By - Sathwik |25 May 2026 1:45 PM IST
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
రాజమహేంద్రవరం పర్యటనలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గోదావరి నది పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించారు.
నదులను కేవలం నీటి వనరులుగా కాకుండా ప్రజల జీవనాధారంగా భావించాలని, వాటి సంరక్షణ విషయంలో అధికారులు రాజీ పడకూడదని ఆయన స్పష్టం చేశారు. గోదావరి నదిలో పెరుగుతున్న కాలుష్యం, మురుగు జలాల కలయిక, వ్యర్థాల నిర్వహణ వంటి అంశాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన పవన్, తక్షణ చర్యలకు అధికారులను ఆదేశించారు. వచ్చే ఆరు నెలల్లో గోదావరి నది పరిసరాల్లో స్పష్టమైన మార్పు కనిపించేలా ప్రణాళికలు అమలు చేయాలని సూచించారు. సోమవారం ఉదయం రాజమహేంద్రవరంలో జరిగిన పర్యటనలో పవన్ కళ్యాణ్ ముందుగా పుష్కర ఘాట్ల వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి పనుల పురోగతిని వివరించారు. పుష్కర్ ఘాట్ నుంచి కోటిలింగాల రేవు వరకు బోటులో ప్రయాణిస్తూ గోదావరి పరిసరాలను స్వయంగా పరిశీలించారు. అఖండ గోదావరి ప్రాజెక్టు పనులపై మంత్రి కందుల దుర్గేశ్ పవన్‌కు వివరాలు అందించారు. నదీ తీర ప్రాంతాల్లో పరిస్థితులను పరిశీలించిన ఆయన, కాలుష్య నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా గోదావరిలోకి చేరుతున్న కాలుష్యకారక వ్యర్థాలు, మురుగు జలాలపై పూర్తిస్థాయి అధ్యయనం చేపట్టాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు.
ఇప్పటివరకు కాలుష్య నియంత్రణ కోసం తీసుకున్న చర్యలు ఏమిటి, భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యక్రమాలు ఏవీ అనే అంశాలపై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ప్రజలకు జీవనాధారమైన నదులను నిర్లక్ష్యం చేయడం వల్ల భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. గోదావరి, కృష్ణా నదులను రక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. రాజమహేంద్రవరం కొన్ని ప్రాంతాల్లో మురుగు నీరు నేరుగా గోదావరిలో కలుస్తున్న అంశంపై పవన్ ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. చింతలమ్మ ఘాట్ వద్ద నల్లా ఛానల్ ద్వారా నదిలోకి చేరుతున్న మురుగు జలాలను ఆయన స్వయంగా పరిశీలించారు. అక్కడి క్షేత్రస్థాయి సిబ్బందితో మాట్లాడి, వ్యర్థాల నిర్వహణ, నీటి శుద్ధి ప్రక్రియల గురించి వివరాలు తెలుసుకున్నారు. నగరంలోని గృహాల నుంచి రోజూ సుమారు 55 ఎంఎల్డీ మురుగు నీరు వస్తోందని అధికారులు వివరించగా, ఈ నీటిని పూర్తిస్థాయిలో శాస్త్రీయ పద్ధతుల్లో శుద్ధి చేయాలని పవన్ ఆదేశించారు. . వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాలను 'కాలుష్యరహిత గోదావరి' అనే ప్రత్యేక అంశంతో నిర్వహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడించారు.
గోదావరి పుష్కరాలకు ఖర్చు చేసే ప్రతి పైసాను ప్రజలకు ఉపయోగపడేలా, నది తీరాన్ని కాపాడే మంచి పనులకే వినియోగించాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కేవలం కాగితాల్లో లెక్కలతో సరిపెట్టకుండా పూర్తిస్థాయి యాక్షన్ ప్లాన్‌తో ముందుకు వెళ్లాలని సూచించారు. కేంద్ర జల శక్తి ద్వారా ఎన్.ఆర్.సి.పి. నిధులు రూ. 416 కోట్లలో, ఇప్పటికే రూ. 95 కోట్ల నిధులకు పరిపాలన అనుమతులు వచ్చాయని వెల్లడించారు. ఈ నిధులతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కొత్త ట్రీట్మెంట్ ప్లాంట్లను నిర్మించాలని, పూర్తిస్థాయిలో మురుగు లేకుండా జలాలను శుద్ధి చేసిన తర్వాతే గోదావరిలోకి విడిచిపెట్టే బాధ్యతను అధికారులు తీసుకోవాలని ఆదేశించారు.
రాజమహేంద్రవరం పర్యటనలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గోదావరి నది పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించారు. నదులను కేవలం నీటి వనరులుగా కాకుండా ప్రజల జీవనాధారంగా భావించాలని, వాటి సంరక్షణ విషయంలో అధికారులు రాజీ పడకూడదని ఆయన స్పష్టం చేశారు. గోదావరి నదిలో పెరుగుతున్న కాలుష్యం, మురుగు జలాల కలయిక, వ్యర్థాల నిర్వహణ వంటి అంశాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన పవన్, తక్షణ చర్యలకు అధికారులను ఆదేశించారు. వచ్చే ఆరు నెలల్లో గోదావరి నది పరిసరాల్లో స్పష్టమైన మార్పు కనిపించేలా ప్రణాళికలు అమలు చేయాలని సూచించారు. సోమవారం ఉదయం రాజమహేంద్రవరంలో జరిగిన పర్యటనలో పవన్ కళ్యాణ్ ముందుగా పుష్కర ఘాట్ల వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి పనుల పురోగతిని వివరించారు. పుష్కర్ ఘాట్ నుంచి కోటిలింగాల రేవు వరకు బోటులో ప్రయాణిస్తూ గోదావరి పరిసరాలను స్వయంగా పరిశీలించారు. అఖండ గోదావరి ప్రాజెక్టు పనులపై మంత్రి కందుల దుర్గేశ్ పవన్‌కు వివరాలు అందించారు. నదీ తీర ప్రాంతాల్లో పరిస్థితులను పరిశీలించిన ఆయన, కాలుష్య నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా గోదావరిలోకి చేరుతున్న కాలుష్యకారక వ్యర్థాలు, మురుగు జలాలపై పూర్తిస్థాయి అధ్యయనం చేపట్టాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు.

