Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
TG: హైస్పీడ్ రైలు హబ్‌గా హైదరాబాద్

TG: హైస్పీడ్ రైలు హబ్‌గా హైదరాబాద్

TV5 News 6 days ago

By - Sathwik |18 May 2026 3:30 PM IST

ఇక హైదరాబాద్ నుంచి ముంబైకి కేవలం 3 గంటల్లో

హైదరాబాద్‌ నుంచి ముంబై వరకు ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించే ప్రతిపాదిత బుల్లెట్‌ రైలు ప్రాజెక్టు కీలక దశకు చేరుకుంది.

దేశంలో వేగవంతమైన రవాణా వ్యవస్థను విస్తరించే లక్ష్యంతో ప్రతిపాదించిన హైదరాబాద్‌-పుణె-ముంబై హైస్పీడ్‌ రైలు కారిడార్‌కు సంబంధించిన డీటెయిల్డ్‌ ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌ (డీపీఆర్‌) సిద్ధమైనట్లు సమాచారం. ఈ ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం లభిస్తే దక్షిణ భారతదేశ రవాణా రంగంలో ఒక పెద్ద మార్పుకు నాంది పలికే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌ నుంచి ముంబైకి రైలు మార్గంలో ప్రయాణించేందుకు 12 నుంచి 15 గంటల సమయం పడుతుండగా, ఈ హైస్పీడ్‌ రైలు అందుబాటులోకి వస్తే అదే ప్రయాణం సుమారు మూడు గంటల్లో పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టును నేషనల్‌ హై స్పీడ్‌ రైల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ రూపొందించినట్లు తెలుస్తోంది. క్షేత్రస్థాయి సర్వేలు పూర్తి చేసిన అనంతరం డీపీఆర్‌ను సిద్ధం చేసి తెలంగాణ ప్రభుత్వానికి సంబంధిత అధికారులు వివరాలు అందించినట్లు సమాచారం. ప్రాజెక్టు రూపకల్పన పూర్తవడంతో తదుపరి అనుమతుల ప్రక్రియ వేగం పుంజుకునే అవకాశముందని భావిస్తున్నారు.

మొత్తం 671 కిలోమీటర్ల మేర....

హైదరాబాద్‌-పుణె-ముంబై మధ్య మొత్తం 671 కిలోమీటర్ల మేర ఈ హైస్పీడ్‌ కారిడార్‌ను నిర్మించనున్నారు. ఇందులో తెలంగాణ రాష్ట్ర పరిధిలో 93 కిలోమీటర్లు, కర్ణాటకలో 121 కిలోమీటర్లు, మహారాష్ట్రలో 457 కిలోమీటర్ల మార్గం ఉంటుంది. ప్రాజెక్టు రూపకల్పనలో అత్యాధునిక సాంకేతిక ప్రమాణాలను అనుసరిస్తున్నారు. మార్గంలో ఎక్కువ భాగాన్ని ఎత్తైన పిల్లర్లపై ఎలివేటెడ్‌ ట్రాక్‌లుగా నిర్మించాలనే ప్రణాళిక సిద్ధం చేశారు. భౌగోళిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పశ్చిమ కనుమల ప్రాంతంలోని ఖండాల ఘాట్‌ వద్ద సుమారు 24 కిలోమీటర్ల మేర 13 సొరంగాలను నిర్మించనున్నారు. అలాగే మహారాష్ట్ర పరిధిలో సుమారు 35 కిలోమీటర్ల మేర భూగర్భ మార్గాన్ని కూడా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ప్రాజెక్టు పరిధిలో రవాణా భద్రతతో పాటు ప్రయాణికుల సౌకర్యాలపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. మొత్తం మార్గంలో 101 వంతెనలు నిర్మించనుండగా, వాటిలో 29 ప్రధాన వంతెనలు కీలక నదులపై ఏర్పాటు చేయనున్నారు. ములా-ముఠా, భీమా, బోరి నదులపై ఈ ప్రధాన వంతెనలను నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించారు. ఆధునిక ఇంజినీరింగ్‌ ప్రమాణాలతో ఈ నిర్మాణాలు చేపట్టనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ప్రయాణికుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని మొత్తం 12 స్టేషన్లను ప్రతిపాదించారు. తెలంగాణలో కోకాపేట, వికారాబాద్‌, శంషాబాద్‌ విమానాశ్రయం సమీప ప్రాంతాల్లో స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. అలాగే కర్ణాటకలో కలబురిగి, మహారాష్ట్రలో విఖ్రోలి, థానే, నవీ ముంబై, లోనావాలా, పుణె, బారామతి, పంఢర్‌పుర్‌, సోలాపూర్‌ ప్రాంతాల్లో స్టేషన్లు నిర్మించనున్నారు. ఈ స్టేషన్లను కేవలం రైల్వే నిలయాలుగా కాకుండా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మల్టీ-ఫంక్షనల్‌ కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు.

ప్రతి స్టేషన్‌ నిర్మాణానికి సుమారు 247 ఎకరాల భూమి అవసరమవుతుందని అంచనా వేస్తున్నారు. భారీ పార్కింగ్‌ సదుపాయాలు, వాణిజ్య సముదాయాలు, ప్రయాణికులకు అవసరమైన ఆధునిక సేవలతో స్టేషన్లను అభివృద్ధి చేయాలని ప్రణాళికలో పేర్కొన్నారు. దీంతో రైల్వే స్టేషన్లు కేవలం ప్రయాణ కేంద్రాలుగానే కాకుండా వాణిజ్య కార్యకలాపాలకు కూడా కేంద్రాలుగా మారే అవకాశముంది. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ప్రయాణికుల వినియోగం కూడా గణనీయంగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రారంభ సంవత్సరంలో రోజుకు సుమారు 63,500 మంది ప్రయాణికులు ఈ సేవలను వినియోగించే అవకాశం ఉందని అంచనాలు సూచిస్తున్నాయి. అనంతరం 2041 నాటికి రోజువారీ ప్రయాణికుల సంఖ్య 95 వేల వరకు చేరవచ్చని, 2061 నాటికి అది 1.52 లక్షలకు పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. హైస్పీడ్‌ రైళ్ల నిర్మాణంలో కూడా ఆధునిక సదుపాయాలు కల్పించనున్నారు. ప్రతి బుల్లెట్‌ రైలులో 16 బోగీలు ఉండగా, మొత్తం 1,215 మంది ప్రయాణికులు ప్రయాణించగల సామర్థ్యం ఉంటుందని సమాచారం. రైళ్ల నిర్వహణ, మరమ్మతుల కోసం థానే, హైదరాబాద్‌ ప్రాంతాల్లో ప్రత్యేక డిపోలు, వర్క్‌షాప్‌లు ఏర్పాటు చేయాలని ప్రణాళికలో ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టుపై స్పందించిన రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దీన్ని కీలక మార్పుకు దారితీసే ప్రాజెక్టుగా అభివర్ణించారు. హైస్పీడ్‌ రైలు కారిడార్‌ అందుబాటులోకి వస్తే వాణిజ్యం, పర్యాటకం, ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్‌ నగరం దక్షిణ భారతదేశ హైస్పీడ్‌ రైలు నెట్‌వర్క్‌కు ప్రధాన కేంద్రంగా ఎదిగే అవకాశం ఉందని తెలిపారు. అయితే ప్రాజెక్టు అమలులోకి రావాలంటే ఇంకా పలు కీలక దశలు మిగిలే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆమోదం, భూసేకరణ, నిధుల సమీకరణ, ఇతర రాష్ట్రాలతో సమన్వయం వంటి అంశాలు కీలకంగా మారనున్నాయి. ఈ అన్ని ప్రక్రియలు విజయవంతంగా పూర్తయితే దేశ రవాణా రంగంలో మరో భారీ మార్పుకు ఈ ప్రాజెక్టు నాంది పలికే అవకాశం ఉందని భావిస్తున్నారు.

హైదరాబాద్‌ నుంచి ముంబై వరకు ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించే ప్రతిపాదిత బుల్లెట్‌ రైలు ప్రాజెక్టు కీలక దశకు చేరుకుంది. దేశంలో వేగవంతమైన రవాణా వ్యవస్థను విస్తరించే లక్ష్యంతో ప్రతిపాదించిన హైదరాబాద్‌-పుణె-ముంబై హైస్పీడ్‌ రైలు కారిడార్‌కు సంబంధించిన డీటెయిల్డ్‌ ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌ (డీపీఆర్‌) సిద్ధమైనట్లు సమాచారం. ఈ ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం లభిస్తే దక్షిణ భారతదేశ రవాణా రంగంలో ఒక పెద్ద మార్పుకు నాంది పలికే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌ నుంచి ముంబైకి రైలు మార్గంలో ప్రయాణించేందుకు 12 నుంచి 15 గంటల సమయం పడుతుండగా, ఈ హైస్పీడ్‌ రైలు అందుబాటులోకి వస్తే అదే ప్రయాణం సుమారు మూడు గంటల్లో పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టును నేషనల్‌ హై స్పీడ్‌ రైల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ రూపొందించినట్లు తెలుస్తోంది. క్షేత్రస్థాయి సర్వేలు పూర్తి చేసిన అనంతరం డీపీఆర్‌ను సిద్ధం చేసి తెలంగాణ ప్రభుత్వానికి సంబంధిత అధికారులు వివరాలు అందించినట్లు సమాచారం. ప్రాజెక్టు రూపకల్పన పూర్తవడంతో తదుపరి అనుమతుల ప్రక్రియ వేగం పుంజుకునే అవకాశముందని భావిస్తున్నారు.

మొత్తం 671 కిలోమీటర్ల మేర....

మొత్తం 671 కిలోమీటర్ల మేర....

మొత్తం 671 కిలోమీటర్ల మేర....

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: TV5 Telugu