By - Sathwik |21 May 2026 11:00 AM IST
శ్రీవారి దర్శనానికి 30 గంటల సమయం
తిరుమల కొండపై మరోసారి భక్తజన సంద్రం ఉప్పొంగింది. వేసవి సెలవులు ముగింపుదశకు చేరుకోవడం, విద్యార్థుల పరీక్షల ఫలితాలు వరుసగా వెలువడుతున్న నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు.
తమ మొక్కులు తీర్చుకోవడంతో పాటు కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకోవాలనే ఉద్దేశంతో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. దీంతో ఆలయ పరిసరాలు, క్యూ మార్గాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరగడంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు పరిస్థితిని నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. బుధవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు సర్వదర్శనం క్యూ లైన్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. అనంతరం రాత్రి నుంచి మళ్లీ భక్తులను అనుమతించారు. అయితే గురువారం ఉదయానికి పరిస్థితి మరింత రద్దీగా మారింది. అందుబాటులో ఉన్న కంపార్టుమెంట్లు అన్నీ భక్తులతో నిండిపోగా, క్యూ లైన్ ఆక్టోపస్ భవనం వరకు విస్తరించింది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
భక్తుల రద్దీ కారణంగా ప్రస్తుతం సర్వదర్శనం కోసం ఎదురుచూస్తున్న వారికి సుమారు 30 గంటల సమయం పట్టే అవకాశం ఉందని టీటీడీ అధికారులు వెల్లడించారు. అలాగే సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులకు స్వామివారి దర్శనం కోసం సుమారు 6 నుంచి 7 గంటల సమయం పట్టవచ్చని తెలిపారు. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం ద్వారా వచ్చే భక్తులకు కూడా 4 నుంచి 5 గంటల వరకు నిరీక్షణ తప్పడం లేదని పేర్కొన్నారు. ఇక బుధవారం ఒక్కరోజే స్వామివారిని 86,315 మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే 44,107 మంది భక్తులు తలనీలాల మొక్కులు సమర్పించారు. భక్తులు సమర్పించిన కానుకలతో శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.94 కోట్లకు చేరినట్లు అధికారులు వెల్లడించారు. ఎండల తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో తిరుమలకు వచ్చే భక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని టీటీడీ సూచించింది. కొండపై భక్తులకు తాగునీరు, అన్నపానీయాలు మరియు ఇతర అవసరమైన సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చర్యలు కొనసాగిస్తున్నట్లు తెలిపింది.
తిరుమల కొండపై మరోసారి భక్తజన సంద్రం ఉప్పొంగింది. వేసవి సెలవులు ముగింపుదశకు చేరుకోవడం, విద్యార్థుల పరీక్షల ఫలితాలు వరుసగా వెలువడుతున్న నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. తమ మొక్కులు తీర్చుకోవడంతో పాటు కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకోవాలనే ఉద్దేశంతో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. దీంతో ఆలయ పరిసరాలు, క్యూ మార్గాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరగడంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు పరిస్థితిని నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. బుధవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు సర్వదర్శనం క్యూ లైన్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. అనంతరం రాత్రి నుంచి మళ్లీ భక్తులను అనుమతించారు. అయితే గురువారం ఉదయానికి పరిస్థితి మరింత రద్దీగా మారింది. అందుబాటులో ఉన్న కంపార్టుమెంట్లు అన్నీ భక్తులతో నిండిపోగా, క్యూ లైన్ ఆక్టోపస్ భవనం వరకు విస్తరించింది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

