By - Radhisha |21 May 2026 10:45 PM IST
తిరుమల వంటి పవిత్ర క్షేత్రం చుట్టూ ఎప్పటికప్పుడు వివాదాలు సృష్టిస్తూ రాజకీయ లాభం పొందాలని ప్రయత్నాలు జరుగుతున్నాయనే విమర్శలు ఇప్పుడు మరింతగా వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఇటీవల చేస్తున్న ఆరోపణలు, వ్యాఖ్యలు చూస్తుంటే తిరుమల విషయంలో ఏదో ఒక రచ్చ చేసి రాజకీయంగా ప్రాధాన్యం పొందాలనే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తోందని టీడీపీ, కూటమి వర్గాలు మండిపడుతున్నాయి. తిరుపతిలో భూ కబ్జాలు జరుగుతున్నాయంటూ భూమన చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి స్పష్టత లేదని, ఆధారాలు లేని రాజకీయ విమర్శలేనని స్థానికులు కూడా చర్చించుకుంటున్నారు. ఒకప్పుడు అధికారంలో ఉన్నప్పుడు జరిగిన వ్యవహారాలపై సమాధానం చెప్పాల్సిన వారు ఇప్పుడు కొత్త కథలు చెప్పడం ఆశ్చర్యంగా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో తిరుపతి పరిసర ప్రాంతాల్లో భూముల వ్యవహారాలు తీవ్ర వివాదాలకు దారితీశాయి. ప్రభుత్వ భూములు, దేవాదాయ శాఖ భూములు, ప్రైవేట్ స్థలాలపై కూడా అనేక ఆరోపణలు వచ్చాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొందరు ఇష్టారీతిన వ్యవహరించారనే విమర్శలు అప్పట్లో పెద్ద ఎత్తున వినిపించాయి. అయితే ఆ సమయంలో ఒక్క మాట కూడా మాట్లాడని భూమన కరుణాకర్ రెడ్డి ఇప్పుడు భూ కబ్జాల పేరుతో కొత్త ఆరోపణలు చేయడం రాజకీయ డ్రామాగా కనిపిస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు జరిగిన విషయాలపై సమాధానం చెప్పకుండా ఇప్పుడు నీతులు చెప్పడం ప్రజలు గమనిస్తున్నారని కూటమి నేతలు చెబుతున్నారు.
తిరుమల లడ్డూ కల్తీ వైసీపీ హయాంలోనే జరగడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. భక్తుల మనోభావాలకు తీవ్రంగా దెబ్బతీసిన ఈ అంశంపై అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. టీటీడీ వంటి విశ్వాసానికి ప్రతీక అయిన సంస్థలో పారదర్శకత లోపించిందని, వ్యవస్థలు బలహీనపడ్డాయని అప్పట్లోనే అనేక మంది ఆందోళన వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు అదే వర్గాలు తిరిగి టీటీడీపై బురదజల్లే ప్రయత్నం చేయడం రాజకీయ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శకులు అంటున్నారు.
తిరుమల వంటి పవిత్ర క్షేత్రం చుట్టూ ఎప్పటికప్పుడు వివాదాలు సృష్టిస్తూ రాజకీయ లాభం పొందాలని ప్రయత్నాలు జరుగుతున్నాయనే విమర్శలు ఇప్పుడు మరింతగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఇటీవల చేస్తున్న ఆరోపణలు, వ్యాఖ్యలు చూస్తుంటే తిరుమల విషయంలో ఏదో ఒక రచ్చ చేసి రాజకీయంగా ప్రాధాన్యం పొందాలనే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తోందని టీడీపీ, కూటమి వర్గాలు మండిపడుతున్నాయి. తిరుపతిలో భూ కబ్జాలు జరుగుతున్నాయంటూ భూమన చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి స్పష్టత లేదని, ఆధారాలు లేని రాజకీయ విమర్శలేనని స్థానికులు కూడా చర్చించుకుంటున్నారు. ఒకప్పుడు అధికారంలో ఉన్నప్పుడు జరిగిన వ్యవహారాలపై సమాధానం చెప్పాల్సిన వారు ఇప్పుడు కొత్త కథలు చెప్పడం ఆశ్చర్యంగా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

