అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న భీకర యుద్ధ వాతావరణాన్ని ముగించే దిశగా కీలక దౌత్యపరమైన ముందడుగు పడింది. ఈ సంక్షోభ పరిష్కారం కోసం ఇరాన్ ప్రభుత్వం 14 అంశాలతో కూడిన నూతన ప్రతిపాదనలను సిద్ధం చేసింది.
పాకిస్థాన్ మధ్యవర్తిత్వం ద్వారా ఈ ప్రణాళికను అమెరికా ప్రభుత్వానికి పంపినట్లు టెహ్రాన్ అధికారిక మీడియా వెల్లడించింది. అమెరికా గతంలో ప్రతిపాదించిన 9 పాయింట్ల ప్రణాళికకు బదులుగా ఇరాన్ ఈ 14 పాయింట్ల ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. కేవలం తాత్కాలిక కాల్పుల విరమణకు ఇరాన్ అంగీకరించడం లేదు. దానికి బదులుగా రాబోయే 30 రోజుల్లో యుద్ధాన్ని శాశ్వతంగా ముగించేలా సమగ్ర పరిష్కారం కావాలని డిమాండ్ చేస్తోంది. లెబనాన్‌తో సహా అన్ని రంగాల్లో ఘర్షణలు ఆగిపోవాలని ఇరాన్ కోరుతోంది. తమ దేశంపై భవిష్యత్తులో దాడులు జరగకుండా అంతర్జాతీయ భద్రతా హామీలు ఇవ్వాలని, సరిహద్దు ప్రాంతాల నుండి అమెరికా బలగాలను ఉపసంహరించుకోవాలని పట్టుబడుతోంది.
నిర్ణయం అమెరికా చేతిలోనే
యుద్ధం కారణంగా జరిగిన ఆర్థిక నష్టానికి పరిహారం చెల్లించాలని, వివిధ దేశాల్లో స్తంభింపజేసిన తమ ఆస్తులను తక్షణమే విడుదల చేయాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. హర్మూజ్ జలసంధిలో ఉన్న దిగ్బంధనాన్ని ఎత్తివేయడంతో పాటు తమపై ఉన్న ఆర్థిక ఆంక్షలను తొలగించాలని కూడా ఈ ప్రతిపాదనల్లో ప్రస్తావించింది. దౌత్య మార్గంలో సమస్యను పరిష్కరించుకోవాలా లేక యుద్ధాన్ని కొనసాగించాలా అన్నది ఇప్పుడు అమెరికా నిర్ణయంపైనే ఆధారపడి ఉందని ఇరాన్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి కాజెమ్ ఘరీబాబాదీ స్పష్టం చేశారు. తమ జాతీయ ప్రయోజనాలను కాపాడుకునేందుకు తాము రెండింటికీ సిద్ధంగా ఉన్నామని ఆయన వ్యాఖ్యానించారు. శాంతి స్థాపనే తమ లక్ష్యమని పేర్కొంటూనే, తమ ప్రతిపాదనలను అమెరికా కోర్టులోకి పంపారు.
స్పందించిన డొనాల్డ్ ట్రంప్
ఇరాన్ ప్రతిపాదనలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ ప్రణాళికను త్వరలోనే సమీక్షిస్తానని పేర్కొంటూనే, ఇరాన్ పట్ల కఠిన వైఖరిని ప్రదర్శించారు. గత 47 ఏళ్లుగా ప్రపంచానికి ఇరాన్ చేసిన నష్టానికి ఇంకా తగిన మూల్యం చెల్లించుకోలేదని ఆయన వ్యాఖ్యానించారు. ఇరాన్ పంపిన ఈ తాజా ప్రతిపాదనలు ఆమోదయోగ్యంగా ఉంటాయని తాను భావించడం లేదని ట్రంప్ సంకేతాలిచ్చారు. దీంతో ఈ దౌత్య ప్రయత్నాలు సఫలమవుతాయా లేదా అన్నది ప్రస్తుతం అంతర్జాతీయ సమాజంలో ఉత్కంఠ రేపుతోంది.
అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న భీకర యుద్ధ వాతావరణాన్ని ముగించే దిశగా కీలక దౌత్యపరమైన ముందడుగు పడింది. ఈ సంక్షోభ పరిష్కారం కోసం ఇరాన్ ప్రభుత్వం 14 అంశాలతో కూడిన నూతన ప్రతిపాదనలను సిద్ధం చేసింది. పాకిస్థాన్ మధ్యవర్తిత్వం ద్వారా ఈ ప్రణాళికను అమెరికా ప్రభుత్వానికి పంపినట్లు టెహ్రాన్ అధికారిక మీడియా వెల్లడించింది. అమెరికా గతంలో ప్రతిపాదించిన 9 పాయింట్ల ప్రణాళికకు బదులుగా ఇరాన్ ఈ 14 పాయింట్ల ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. కేవలం తాత్కాలిక కాల్పుల విరమణకు ఇరాన్ అంగీకరించడం లేదు. దానికి బదులుగా రాబోయే 30 రోజుల్లో యుద్ధాన్ని శాశ్వతంగా ముగించేలా సమగ్ర పరిష్కారం కావాలని డిమాండ్ చేస్తోంది. లెబనాన్‌తో సహా అన్ని రంగాల్లో ఘర్షణలు ఆగిపోవాలని ఇరాన్ కోరుతోంది. తమ దేశంపై భవిష్యత్తులో దాడులు జరగకుండా అంతర్జాతీయ భద్రతా హామీలు ఇవ్వాలని, సరిహద్దు ప్రాంతాల నుండి అమెరికా బలగాలను ఉపసంహరించుకోవాలని పట్టుబడుతోంది.
నిర్ణయం అమెరికా చేతిలోనే
స్పందించిన డొనాల్డ్ ట్రంప్
నిర్ణయం అమెరికా చేతిలోనే
స్పందించిన డొనాల్డ్ ట్రంప్

