Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Vijay :తమిళనాట విజయ్ మార్క్ షురూ.. నిరూపించుకుంటాడా..?

Vijay :తమిళనాట విజయ్ మార్క్ షురూ.. నిరూపించుకుంటాడా..?

TV5 News 1 week ago

By - Radhisha |15 May 2026 10:48 AM IST

తమిళనాట సుదీర్ఘ చరిత్ర కలిగిన పార్టీలు ప్రతిపక్ష హోదాలకు పరిమితం అయ్యాయి. కానీ కొత్త పార్టీ వచ్చిన రెండేళ్లకే అధికారంలోకి వచ్చింది.

అంతటి ఘన చరిత్ర కలిగిన పార్టీలను కాదని విజయ్ కు పీఠం ఇచ్చారు తమిళ తంబీలు. ఇదంతా విజయ్ మీదున్న నమ్మకంతోనే జరిగింది. గతం కంటే భిన్నమైన పరిపాలనను తమిళులు కోరుకున్నారు. ఆ విషయం స్పష్టంగా అర్థం అయింది. ఇక అందరూ ఊహించినట్టే అసెంబ్లీలో కూడా బలనిరూపన చేసుకున్నారు. 114 ఓట్ల మెజార్టీ సాధించాడు విజయ్. దీంతో ఆయనకు తిరుగులేకుండా పోయింది. ఇన్ని రోజులు ఇబ్బంది పెట్టిన మెజార్టీని ఎలాగూ సాధించేశాడు విజయ్. ఇక మిగిలింది మాత్రం పరిపాలన పరంగా నిరూపించుకోవడమే.

అధికారంలో రావడం ఒక ఎత్తు అయితే.. పరిపాలనా పరంగా నిరూపించుకోవడం ఇంకో ఎత్తు. అనేక పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల మెప్పు పొంద లేక.. పరిపాలనలో విజయం సాధించలేక చతికిల పడ్డాయి. చివరకు కనుమరుగైపోయాయి కూడా. ఉదాహరణకు వైసీపీ అధికారంలోకి వచ్చి ప్రజల మెప్పు పొందలేకపోయింది. జగన్ పరిపాలనను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. అత్యంత దారుణమైన పరిపాలనను ప్రజలు చూశారు.

అలాగే ఎన్నో పార్టీలు వరుసగా ఐదుసార్లు గెలిచిన చరిత్ర కూడా ఉంది. కాబట్టి విజయ్ వారిలాగా మరోసారి ప్రజల మనసులు గెలుచుకునేలా పరిపాలిస్తాడా లేదంటే ప్రజలను మెప్పించలేక చతికిల పడుతాడా అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న. ప్రస్తుతానికి అయితే విజయ్ మీద తిరుగులేని అంచనాలున్నాయి. కాబట్టి విజయ్ వాటిని అందుకుని ముందుకు వెళ్తేనే విజయం సాధిస్తాడు తప్ప అంచనాలు అందుకోలేకపోతే మాత్రం కచ్చితంగా దెబ్బ పడుతుంది.

తమిళనాట సుదీర్ఘ చరిత్ర కలిగిన పార్టీలు ప్రతిపక్ష హోదాలకు పరిమితం అయ్యాయి. కానీ కొత్త పార్టీ వచ్చిన రెండేళ్లకే అధికారంలోకి వచ్చింది. అంతటి ఘన చరిత్ర కలిగిన పార్టీలను కాదని విజయ్ కు పీఠం ఇచ్చారు తమిళ తంబీలు. ఇదంతా విజయ్ మీదున్న నమ్మకంతోనే జరిగింది. గతం కంటే భిన్నమైన పరిపాలనను తమిళులు కోరుకున్నారు. ఆ విషయం స్పష్టంగా అర్థం అయింది. ఇక అందరూ ఊహించినట్టే అసెంబ్లీలో కూడా బలనిరూపన చేసుకున్నారు. 114 ఓట్ల మెజార్టీ సాధించాడు విజయ్. దీంతో ఆయనకు తిరుగులేకుండా పోయింది. ఇన్ని రోజులు ఇబ్బంది పెట్టిన మెజార్టీని ఎలాగూ సాధించేశాడు విజయ్. ఇక మిగిలింది మాత్రం పరిపాలన పరంగా నిరూపించుకోవడమే.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: TV5 Telugu