By - Radhisha |16 May 2026 1:15 PM IST
ఏపీకి అగ్ర కంపెనీలు వరుసగా క్యూ కడుతున్నాయి. లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. కంపెనీలకు వరుసగా శంకుస్థాపనలు కూడా జరుగుతున్నాయి.
అనేక కంపెనీలు ఇంకా ఎంవోయూలు కుదుర్చుకునేందుకు రెడీ అవుతున్నాయి. ఇప్పటికే లక్షల్లో ఉద్యోగాలు కల్పించేందుకు మార్గం సుగుమం అయింది. అయితే ఇప్పుడు ఇన్ని లక్షల పెట్టుబడులు రావడాన్ని చూసి గత జగన్ పాలన గురించే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. జగన్ హయాంలో ఒక్క కంపెనీ కూడా ప్రారంభానికి నోచుకోలేదు. ఎంతసేపు ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి.. అన్ని వచ్చాయి అని చెప్పడం వరకే పరిమితం అయింది అప్పటి వైసీపీ ప్రభుత్వం. అంతే గానీ.. అసలు ఏ కంపెనీ ఏపికి వచ్చిందో కూడా వాళ్లు చెప్పలేకపోయారు. అప్పట్లో ఉద్యోగాలు లేక ఏపీ యువత బయటి రాష్ట్రాలకు వలస వెళ్లిపోవాల్సి వచ్చింది.
కానీ ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడి హయాంలో మాత్రం లక్షల కోట్ల పెట్టుబడులు ఏపీకి వస్తున్నాయి. దీంతో ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయిన వారంతా ఏపీకి తిరిగి వస్తున్నారు. ఎందుకంటే ఇక్కడే ప్రపంచ స్థాయి కంపెనీలు వచ్చిన తర్వాత హైదరాబాద్, బెంగుళూరు, ముంబై, చెన్నై లాంటి నగరాలలో ఉన్న ఏపీ యువత ఇక్కడకు రావడమే మేలు అనుకుంటున్నారు. అందుకే ఏపీకి తిరిగి వచ్చేస్తున్నారు.
ఈ రకమైన తేడాను చూసిన వారంతా జగన్ పరిపాలన ఎంత చెత్తగా ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అంటున్నారు. ఎందుకంటే జగన్ పరిపాలనలో ఒక్కటి కూడా ఓపెన్ కాలేదు. కానీ చంద్రబాబు హయాంలో గూగుల్, టీసీఎస్, కాగ్నిజెంట్ లాంటి టెక్ కంపెనీలు ఏపీకి వస్తున్నాయి. ఇలాంటి అనేక రకాల విషయాల్లో చంద్రబాబు పాలనకు, జగన్ పాలనకు ఉన్న తేడాను అందరూ గమనిస్తున్నారు.
ఏపీకి అగ్ర కంపెనీలు వరుసగా క్యూ కడుతున్నాయి. లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. కంపెనీలకు వరుసగా శంకుస్థాపనలు కూడా జరుగుతున్నాయి. అనేక కంపెనీలు ఇంకా ఎంవోయూలు కుదుర్చుకునేందుకు రెడీ అవుతున్నాయి. ఇప్పటికే లక్షల్లో ఉద్యోగాలు కల్పించేందుకు మార్గం సుగుమం అయింది. అయితే ఇప్పుడు ఇన్ని లక్షల పెట్టుబడులు రావడాన్ని చూసి గత జగన్ పాలన గురించే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. జగన్ హయాంలో ఒక్క కంపెనీ కూడా ప్రారంభానికి నోచుకోలేదు. ఎంతసేపు ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి.. అన్ని వచ్చాయి అని చెప్పడం వరకే పరిమితం అయింది అప్పటి వైసీపీ ప్రభుత్వం. అంతే గానీ.. అసలు ఏ కంపెనీ ఏపికి వచ్చిందో కూడా వాళ్లు చెప్పలేకపోయారు. అప్పట్లో ఉద్యోగాలు లేక ఏపీ యువత బయటి రాష్ట్రాలకు వలస వెళ్లిపోవాల్సి వచ్చింది.

