By - Radhisha |22 May 2026 3:11 PM IST
మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మరోసారి సెంటిమెంట్ రాజకీయాలకు తెరలేపారు. ప్రజా సమస్యలు, అభివృద్ధి అంశాలపై మాట్లాడాల్సిన సమయంలో తన తాత రాజారెడ్డి, తండ్రి మరణాలను రాజకీయ రంగంలోకి లాగుతూ కూటమి ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
నిన్న నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో జగన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ప్రజలకు ఉపయోగపడే అంశాలపై మాట్లాడకుండా మళ్లీ పాత సెంటిమెంట్‌ను తెరపైకి తీసుకురావడం వెనుక స్పష్టమైన రాజకీయ ఉద్దేశమే కనిపిస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో రాష్ట్రానికి చెప్పుకోదగ్గ అభివృద్ధి చేయలేకపోయిన జగన్ ఇప్పుడు ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇలాంటి పసలేని ఆరోపణలు చేస్తున్నారు. పరిశ్రమలు, ఉద్యోగాలు, రోడ్లు, పెట్టుబడులు, రాజధాని నిర్మాణం వంటి కీలక అంశాల్లో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.
ఇప్పుడు ప్రజలు అభివృద్ధి గురించి ప్రశ్నిస్తున్న వేళ జగన్ వద్ద సమాధానాలు లేకపోవడంతో సెంటిమెంట్ అస్త్రాన్ని బయటకు తీస్తున్నారు. తాత రాజారెడ్డి హత్య, తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి దుర్మరణాన్ని రాజకీయ కోణంలో చూపిస్తూ ప్రత్యర్థులపై ఆరోపణలు చేయడం ద్వారా రాజకీయ లాభం పొందాలని చూస్తున్నారనే చర్చ జరుగుతోంది. జగన్ మళ్లీ అదే సెంటిమెంట్ రాజకీయాలను ముందుకు తెస్తుండటంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.
ప్రతిసారి కుటుంబ మరణాలను ప్రస్తావించి రాజకీయంగా లబ్ది పొందాలనుకోవడం ఏంటి..? రాజకీయాల్లో విమర్శలు సహజమే అయినా, వ్యక్తిగత విషాదాలను పదే పదే రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించడం సరైన విధానం కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి అభివృద్ధిపై మాట్లాడే పరిస్థితి లేకపోవడంతోనే జగన్ మరోసారి సెంటిమెంట్ రాజకీయాలకు తెరలేపారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.
మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మరోసారి సెంటిమెంట్ రాజకీయాలకు తెరలేపారు. ప్రజా సమస్యలు, అభివృద్ధి అంశాలపై మాట్లాడాల్సిన సమయంలో తన తాత రాజారెడ్డి, తండ్రి మరణాలను రాజకీయ రంగంలోకి లాగుతూ కూటమి ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిన్న నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో జగన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ప్రజలకు ఉపయోగపడే అంశాలపై మాట్లాడకుండా మళ్లీ పాత సెంటిమెంట్‌ను తెరపైకి తీసుకురావడం వెనుక స్పష్టమైన రాజకీయ ఉద్దేశమే కనిపిస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో రాష్ట్రానికి చెప్పుకోదగ్గ అభివృద్ధి చేయలేకపోయిన జగన్ ఇప్పుడు ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇలాంటి పసలేని ఆరోపణలు చేస్తున్నారు. పరిశ్రమలు, ఉద్యోగాలు, రోడ్లు, పెట్టుబడులు, రాజధాని నిర్మాణం వంటి కీలక అంశాల్లో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.

