By - Radhisha |22 May 2026 4:00 PM IST
వైఎస్ జగన్ ఎన్ని రకాల మాటలు మాట్లాడుతున్నారో ఆయనకు కూడా పూర్తిగా అర్థం కావట్లేదు అనుకుంట. ఎందుకంటే రాజకీయంగా తనకు ఉనికి లేని ప్రతిసారి సెంటిమెంట్ రాజకీయాలకు తెర తీస్తున్నారు జగన్.
ఇక ప్రస్తుతం ప్రజలు పట్టించుకోవట్లేదనే నెపంతో.. తన తండ్రి, తాత రాజకీయాలను తెరమీదకు తెస్తున్నారు. తన తండ్రి చనిపోయినప్పుడు, తాత చనిపోయినప్పుడు చంద్రబాబు అధికారంలో ఉన్నారని.. ఏదో చేశారంటూ లేనిపోనివి మాట్లాడుతున్నారు. ఇక్కడ కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. రాజశేఖర్ రెడ్డి చనిపోయినప్పుడు జగన్ పాదయాత్ర చేశారు. తన తండ్రి మరణానికి చంద్రబాబు, రిలయన్స్ అంబానీ, రామోజీరావు కుట్రలు చేశారంటూ తీవ్రంగా ఆరోపించారు జగన్. కానీ అదే జగన్ అధికారంలో ఉన్నప్పుడు మాత్రం దీనిపై విచారణ జరిపించలేదు.
పైగా తాను స్వయంగా ఆరోపించిన అంబానీ కుడిభుజం అయిన పరిమల్ నక్వానీకి రాజ్యసభ పదవి ఇచ్చారు జగన్. ఇప్పటికీ నక్వానీ వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. మరి జగన్ తన తండ్రిని చంపిన వ్యక్తి చెప్తే ఎందుకు విన్నాడు. ఆయన సీఎంగా ఐదేళ్లు ఉన్నప్పుడు తండ్రి మరణం మీద ఎందుకు విచారణ జరిపించలేదు. పైగా జగన్ సీఎంగా ఉన్నప్పుడే అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు వివేకా హత్య కేసులో అరెస్ట్ చేసింది కదా.
మరి అవినాష్ రెడ్డి హస్తం లేకపోతే సీబీఐ అరెస్ట్ చేస్తుంటే జగన్ ఎందుకు మౌనంగా ఉండిపోయారు. కానీ వీటికి జగన్ వద్ద సమాధానాలు లేవు. రాజారెడ్డి మరణంపై పార్థసారథి కూడా చెప్పాడు కదా.. తమను వేధిస్తే జరిగిన గొడవల్లో చనిపోయారు అని. కానీ అధికారంలో ఉన్నప్పుడు మౌనంగా ఉండి.. ఎక్కడ తాను ఇరుక్కుంటానో అని వాటిని వదిలేసిన జగన్.. ఇప్పుడు మాత్రం కూటమి మీద బురద జల్లడం కోసం ఇలాంటి పసలేని ఆరోపణలు చేస్తున్నారు.
వైఎస్ జగన్ ఎన్ని రకాల మాటలు మాట్లాడుతున్నారో ఆయనకు కూడా పూర్తిగా అర్థం కావట్లేదు అనుకుంట. ఎందుకంటే రాజకీయంగా తనకు ఉనికి లేని ప్రతిసారి సెంటిమెంట్ రాజకీయాలకు తెర తీస్తున్నారు జగన్. ఇక ప్రస్తుతం ప్రజలు పట్టించుకోవట్లేదనే నెపంతో.. తన తండ్రి, తాత రాజకీయాలను తెరమీదకు తెస్తున్నారు. తన తండ్రి చనిపోయినప్పుడు, తాత చనిపోయినప్పుడు చంద్రబాబు అధికారంలో ఉన్నారని.. ఏదో చేశారంటూ లేనిపోనివి మాట్లాడుతున్నారు. ఇక్కడ కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. రాజశేఖర్ రెడ్డి చనిపోయినప్పుడు జగన్ పాదయాత్ర చేశారు. తన తండ్రి మరణానికి చంద్రబాబు, రిలయన్స్ అంబానీ, రామోజీరావు కుట్రలు చేశారంటూ తీవ్రంగా ఆరోపించారు జగన్. కానీ అదే జగన్ అధికారంలో ఉన్నప్పుడు మాత్రం దీనిపై విచారణ జరిపించలేదు.

