Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
YSRCP : కూటమి మధ్య చిచ్చుకు వైసీపీ కుట్రలు..?

YSRCP : కూటమి మధ్య చిచ్చుకు వైసీపీ కుట్రలు..?

TV5 News 3 days ago

By - Radhisha |22 May 2026 3:30 PM IST

కూటమి ప్రభుత్వం మధ్య చిచ్చు పెట్టేందుకు వైసీపీ కుట్రలు చేస్తోందని తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. కూటమి కలిసి ఉన్నంత కాలం వైసీపీ గెలవలేదనే విషయం జగన్ కు కూడా అర్థం అవుతోంది.

ఎలాగూ తన హయాంలో అభివృద్ధి జరగలేదు. కాబట్టి ఇప్పుడు అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత తనకు లేదనే కారణంతో జగన్.. కుట్రలతో చిచ్చులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే కూటమిని విడదీసేందుకు తన సోషల్ మీడియా బ్యాచ్ తో రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. టీడీపీ ఫేక్ అకౌంట్లతో జనసేనను తిట్టడం.. జనసేన ఫేక్ అకౌంట్లతో టీడీపీని తిట్టడం మనకు కనిపిస్తోంది. ఇలా రెండు పార్టీలను ఫేక్ అకౌంట్లతో తిట్టి పార్టీల మధ్య వైరం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే విషయాన్ని నారా లోకేష్‌ కూడా ప్రస్తావించారు. కాబట్టి వైసీపీ కుట్రలను అందరూ గమనించాలని కోరుతున్నారు.

నిజమే మరి.. ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు విలువలు పాటించాలి. కానీ జగన్ కు అలాంటివేమీ తెలియదు. తనకు అధికారం రావడం కోసం ఎలాంటి పనులు చేయడానికైనా వెనకాడని వ్యక్తి జగన్. కాబట్టి అలాంటి వ్యక్తిని అత్యంత దారుణంగా ఓడించారు ప్రజలు. అయినా సరే జగన్ మాత్రం తన వ్యక్తిత్వాన్ని మార్చుకోవట్లేదు. ఎంతసేపు తన స్వార్థాన్ని చూసుకుంటూ ముందుకు వెళ్తున్నారు.

కానీ జగన్ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. తన కుట్రలను కూటమి కార్యకర్తలు ఈజీగా పసిగట్టేస్తారు. అందుకే ఆయన ఎన్ని రకాల కుట్రలకు పాల్పడినా సరే ఎవరూ పట్టించుకోరు. ఎందుకంటే చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ అంటే ఏంటో ఎలా ఉంటారో అందరికీ తెలుసు. రాజకీయంగా జగన్ అరాచక పాలనను మళ్లీ రానివ్వకుండా ఉండటం కోసం కూటమి ఎప్పటికీ కలిసే ఉండాలని మూడు పార్టీల కార్యకర్తలు కోరుకుంటున్నారు.

కూటమి ప్రభుత్వం మధ్య చిచ్చు పెట్టేందుకు వైసీపీ కుట్రలు చేస్తోందని తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. కూటమి కలిసి ఉన్నంత కాలం వైసీపీ గెలవలేదనే విషయం జగన్ కు కూడా అర్థం అవుతోంది. ఎలాగూ తన హయాంలో అభివృద్ధి జరగలేదు. కాబట్టి ఇప్పుడు అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత తనకు లేదనే కారణంతో జగన్.. కుట్రలతో చిచ్చులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే కూటమిని విడదీసేందుకు తన సోషల్ మీడియా బ్యాచ్ తో రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. టీడీపీ ఫేక్ అకౌంట్లతో జనసేనను తిట్టడం.. జనసేన ఫేక్ అకౌంట్లతో టీడీపీని తిట్టడం మనకు కనిపిస్తోంది. ఇలా రెండు పార్టీలను ఫేక్ అకౌంట్లతో తిట్టి పార్టీల మధ్య వైరం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే విషయాన్ని నారా లోకేష్‌ కూడా ప్రస్తావించారు. కాబట్టి వైసీపీ కుట్రలను అందరూ గమనించాలని కోరుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: TV5 Telugu