By - Radhisha |15 May 2026 11:30 AM IST
వైసీపీ ఓడిపోయినప్పటి నుంచి అనేక మంది సైలెంట్ అయిపోయారు. అధికారంలో ఉన్నప్పుడు జగన్ ను మెప్పించడానికి ప్రతిపక్ష పార్టీగా ఉన్న టీడీపీ నేతలను ఎంత దారుణంగా తిట్టారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడిని తిట్టడానికే కొందరు నేతలు పనిగట్టుకుని మరీ పనిచేసేవారు. అంత దారుణంగా జగన్ హయాంలో రెచ్చిపోయారు మంత్రులు. అయితే వారి దారుణాలు ప్రజలు చూసి తట్టుకోలేక అత్యంత దారుణంగా వారిని ఓడించారు. అప్పట్లో రెచ్చిపోయిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలను అందరినీ ప్రజలు ఓడించారు. వైసీపీ ఓడిపోయినప్పటి నుంచి ఆయా నేతలంతా సైలెంట్ గా ఉండిపోయారు. చాలా కాలంగా వారిని యాక్టివ్ గా ఉండాలని జగన్ ఆదేశిస్తున్నారంట. కానీ వారెవ్వరూ మీడియా ముందుకు వచ్చేందుకు కూడా ఇష్టపడట్లేదు.
మరీ ముఖ్యంగా వైసీపీ హయాంలో ఎమ్మెల్యేలు, మంత్రులుగా ఉండి రెచ్చిపోయి ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన వారంతా ఇప్పుడు సైలెంట్ గానే ఉంటున్నారు. వీరు ఇప్పుడిప్పుడే వారి మిస్టేక్స్ ను అర్థం చేసుకుంటున్నారంట. జగన్ తిట్టమని ఆదేశించడంతో చంద్రబాబును, టీడీపీ నేతలను, పవన్ కల్యాణ్ ను అత్యంత దారుణంగా తిట్టి తమకు రాజకీయ జీవితం లేకుండా చేసుకున్నామని పశ్చాత్తాప పడుతున్నారంట.
రాజకీయాల్లో సుదీర్ఘ కాలం మనుగడ సాగించాలంటే ఇలా ఇష్టం వచ్చినట్టు తిడితే ప్రజలు ఒప్పుకోరు అనేది వారికి కూడా అర్థం అయింది. ఒకసారి అధికారాన్ని కోరుకుని ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతే కుదరదు కదా. ఆ విషయం వారికి స్పష్టంగా అర్థం అవుతోంది కాబట్టే జగన్ మళ్లీ మీడియా ముందుకు వచ్చి తిట్టమని ఆదేశిస్తుంటే పట్టించుకోవట్లేదంట. ఆల్రెడీ చేసిన మిస్టేక్ మళ్లీ చేయొద్దనే ఉద్దేశంతో వారంతా సైలెంట్ గా ఉంటున్నట్టు సమాచారం.
వైసీపీ ఓడిపోయినప్పటి నుంచి అనేక మంది సైలెంట్ అయిపోయారు. అధికారంలో ఉన్నప్పుడు జగన్ ను మెప్పించడానికి ప్రతిపక్ష పార్టీగా ఉన్న టీడీపీ నేతలను ఎంత దారుణంగా తిట్టారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడిని తిట్టడానికే కొందరు నేతలు పనిగట్టుకుని మరీ పనిచేసేవారు. అంత దారుణంగా జగన్ హయాంలో రెచ్చిపోయారు మంత్రులు. అయితే వారి దారుణాలు ప్రజలు చూసి తట్టుకోలేక అత్యంత దారుణంగా వారిని ఓడించారు. అప్పట్లో రెచ్చిపోయిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలను అందరినీ ప్రజలు ఓడించారు. వైసీపీ ఓడిపోయినప్పటి నుంచి ఆయా నేతలంతా సైలెంట్ గా ఉండిపోయారు. చాలా కాలంగా వారిని యాక్టివ్ గా ఉండాలని జగన్ ఆదేశిస్తున్నారంట. కానీ వారెవ్వరూ మీడియా ముందుకు వచ్చేందుకు కూడా ఇష్టపడట్లేదు.

