Monday, 23 Sep, 11.43 am TV9 తెలుగు

హోమ్
ఐఫా వేడుకల్లో 'అనుకోని అతిథి'.. అదీ 'సెలబ్రిటీయే' మరి..!

ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్(ఐఫా).. 20వ ఎడిషన్ వేడుకలు ఇటీవల ఘనంగా ముగిశాయి. ఆ కార్యక్రమానికి బాలీవుడ్‌కు చెందిన ప్రముఖులు చాలా మంది హాజరై సందడి చేశారు. ఇదిలా ఉంటే ఈ కార్యక్రమం కోసం వెళ్లిన బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ గ్రీన్ కార్పెట్ ద్వారా లోపలికి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. ఇక ఆయన అటు వెళ్తూనే అనుకోని అతిథిగా ఓ వీధి కుక్క కూడా వెనకాలే వచ్చింది. దీంతో అక్కడున్న కెమెరాలన్నీ ఒక్కసారిగా క్లిక్ మన్నాయి.

ఇక ఆ తరువాత ఆ కుక్కను నటి అదితి భాటియా ఇంటర్వ్యూ చేసింది. ''హాయ్… ఇక్కడకు అనుకోని అతిథి వచ్చారు. తనను ఇంటర్వ్యూ చేసి బోలెడు విషయాలు తెలుసుకుందాం'' అంటూ అదితి.. ఆ కుక్కను రకరకాల ప్రశ్నలు అడిగింది. వాటికి సమాధానంగా… తన ముందు రెండు కాళ్లతో షేక్ హ్యాండ్ ఇచ్చింది ఆ శునకం. ఇక ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లక్షల వ్యూస్‌తో దూసుకుపోతున్న ఈ వీడియోకు నెటిజన్లు ''వావ్.. క్యూట్.. నీ ఎంట్రీ అదుర్స్'' అంటూ కామెంట్లు పెడుతున్నారు.

View this post on Instagram

Spread love! 🐶❤️

A post shared by Aditi Bhatia 🎭 (@aditi_bhatia4) on

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: TV9 Telugu
Top