Saturday, 21 Sep, 1.17 pm TV9 తెలుగు

హోమ్
కొత్త వైరస్ టెన్షన్.. కన్నుమూసిన మూడు గజరాజులు

భువనేశ్వర్‌లో ఉన్న నందన్‌కనన్ జూ పార్క్‌లో మరణ మృదంగం కొనసాగుతోంది. హెర్పస్ వైరస్ బారిన పడ్డ గజాలు ఒక్కొక్కటిగా తనువు చాలిస్తున్నాయి. తాజాగా కమల(7ఏళ్లు) చికిత్స పొందుతూ గురువారం ప్రాణాలు వదిలింది. దీంతో 25 రోజుల వ్యవధిలో హెర్పస్ వైరస్ సోకి మరణించిన గజాల సంఖ్య మూడుకు చేరింది. ఇక ప్రస్తుతం అక్కడ ఐదు ఏనుగులు మాత్రమే ఉండగా.. వాటిలో మరో రెండింటికి ఈ వైరస్ లక్షణాలు ఉన్నాయని జూ డిప్యూటీ డైరక్టర్ జయంత్ దాస్ వెల్లడించారు. వాటిని అప్జర్వేషన్‌లో పెట్టినట్లు ఆయన తెలిపారు.

కాగా మరోవైపు ఈ వైరస్‌కు ఇంకా మందును కనుగొనలేదని.. ఇప్పటి దాకా వాడిన ఔషధాల వల్ల వాటి ఆరోగ్యం మెరుగుపడలేదని పశు సంవర్ధక శాఖ అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉంటే ఆగష్టులో ఈ జూపార్క్‌లో మొదటి హెర్పస్ కేసు నమోదైంది. ఈ వైరస్ సోకిన జూలీ అనే ఆడ ఏనుగు ఆగష్టు 25న కన్నుమూసింది. ఆ తరువాత సెప్టెంబర్ 15న చందన్ అనే మరో మగ ఏనుగు హెర్పస్ సోకి మృత్యువాతపడింది. దీంతో జూ అధికారుల్లో ఆందోళన పెరుగుతోంది. మిగిలిన వాటిని రక్షించుకునేందుకు వారు చర్యలు ముమ్మరం చేశారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: TV9 Telugu
Top