Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
152 vs 148 మీటర్లు.. తుమ్మడిహట్టి ప్రాజెక్ట్ ఎత్తుపై తేలని స్పష్టత

152 vs 148 మీటర్లు.. తుమ్మడిహట్టి ప్రాజెక్ట్ ఎత్తుపై తేలని స్పష్టత

V6 Velugu 2 weeks ago

తుమ్మడిహట్టి బ్యారేజ్ ఎత్తు పెంపు వివాదంపై ఢిల్లీలో కేంద్ర జలసంఘం (CWC) ఆధ్వర్యంలో జరిగిన కీలక సమావేశం ముగిసింది. ఈ భేటీకి తెలంగాణ, మహారాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులు హాజరయ్యారు.

బ్యారేజ్ ఎత్తు పెంపు, ముంపు తీవ్రత ,అంతరాష్ట్ర అంశాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ప్రాజెక్ట్ ఎత్తును 152 మీటర్లకు పెంచుకుంటామని తెలంగాణ అధికారులు ఈ సందర్భంగా ప్రతిపాదించారు. గతంలో కుదిరిన ఒప్పందాలను సవరించాలని వారు కోరారు.

అయితే, దీనిని మహారాష్ట్ర అధికారులు తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రాజెక్ట్ ఎత్తును కేవలం 148 మీటర్ల పరిమితిలోనే ఉంచాలని తమ వాదనను గట్టిగా వినిపించారు. ముంపు ప్రభావంపై ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

1000 రోజుల ప్రజాపాలన.. మహిళలకు ఫ్రీ జర్నీ నుంచి ఈవీ బస్సుల దాకా.. ఆర్టీసీలో విప్లవాత్మక మార్పులు

ఇరు రాష్ట్రాల వాదనలను విన్న CWC అధికారులు, ఈ అంశంపై మరింత లోతుగా చర్చించేందుకు మరో రెండు వారాల తర్వాత మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు. మరి రాబోయే భేటీలోనైనా దీనికి ఒక స్పష్టత వస్తుందో లేదో వేచి చూడాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News