Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆ  కో పైలెట్ 'మతోన్మాది'?..ఫ్లైదుబాయ్ విమాన ఘటనలో సంచలనం

ఆ కో పైలెట్ 'మతోన్మాది'?..ఫ్లైదుబాయ్ విమాన ఘటనలో సంచలనం

V6 Velugu 1 hr ago

రియాద్: ఫ్లైదుబాయ్ విమాన ఘటనలో నిందితుడైన కో-పైలట్ గురించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తోటి పైలట్లు ఇతడిని మతోన్మాదిగా ఆరోపణలు చేస్తున్నారు.

ఇజ్రాయెల్ వార్తా సంస్థ 'ఛానెల్ 16'తో మాట్లాడిన ఓ తోటి ఫ్లై దుబాయ్ పైలట్.. నిందితుడైన కో -పైలట్ ప్రవర్తన గురించి కీలక వివరాలు వెల్లడించారు. సదరు నిందితుడు కేవలం 8 నెలల క్రితమే ఫ్లైదుబాయ్ సంస్థలో ఉద్యోగంలో చేరాడని తెలిపారు.

విధుల్లో ఉన్న సమయంలో నిత్యం అతిగా ప్రార్థనలు చేయడం, మహిళలతో షేక్‌హ్యాండ్ చేయడానికి కూడా నిరాకరించడం వంటి విపరీత ధోరణులు ప్రదర్శించేవాడని సహచర పైలట్ పేర్కొన్నారు. దీంతో ఇతడిని తోటి సిబ్బంది ఒక మతోన్మాదిగా అభివర్ణించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News