Dailyhunt
ఆ షూటింగ్ సమయంలో నరకం చూశా.. మాళవిక మోహనన్ ఎమోషనల్ పోస్ట్ వైరల్!

ఆ షూటింగ్ సమయంలో నరకం చూశా.. మాళవిక మోహనన్ ఎమోషనల్ పోస్ట్ వైరల్!

V6 Velugu 1 week ago

సినీ గ్లామర్ ప్రపంచంలో తన కంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న నటి మాళవిక మోహనన్ . వచ్చిన ప్రతి సినిమాను సద్వినియోగం చేసుకుంటూ తన టాలెంట్ ను నిరూపించుకుంటుంది..

షూటింగ్ నిమిత్తం తన ఇంటికి, కుటుంబానికి దూరంగా గడిపిన సమయంలో తను అనుభవించిన మానసిక సంఘర్షణను లేటెస్ట్ గా ఆమె తన అభిమానులతో పంచుకున్నారు. ఈ బిజీ లైఫ్ లో సామాన్యులలాగే ఒంటిరితనం, ఇంటిపై బెంగ ఉంటాయంటూ తన మనసులోని బాధను వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.

మిశ్రమ అనుభూతులను మిగిల్చిన మార్చి..

మార్చి నెల తనకు మిశ్రమ అనుభూతులను మిగిల్చిందని మాళవిక పేర్కొన్నారు. ఇందులో అత్యంత ఆనందకరమైన విషయం ఏమిటంటే, దిగ్గజ దర్శకుడు త్యాగరాజన్ కుమారరాజ దర్శకత్వంలో 'పాకెట్ నవల్' అనే ప్రాజెక్ట్ కోసం పని చేయడం. ఈ తరం గొప్ప దర్శకుల్లో ఆయన ఒకరు. ఆయన పనితీరును గమనించడం, ఆయన మార్గదర్శకత్వంలో నటిగా నన్ను నేను మలుచుకోవడం నా కెరీర్‌లోనే ఒక అద్భుతమైన సృజనాత్మక అనుభవం అని మాళవిక కితాబిచ్చారు.

ఒంటరితనంతో పోరాటం..

వృత్తిపరంగా ఎంతో సంతృప్తినిచ్చినప్పటికీ, వ్యక్తిగతంగా ఈ ప్రయాణం బాగా ఇబ్బంది పెట్టిందని మాళవిక పేర్కొన్నారు. షూటింగ్ కోసం నెలలో చాలా రోజులు చెన్నైలోనే గడిపడం , ఇంటికి దూరంగా ఉండటం వల్ల చాలా బాధను అనుభవించానని చెప్పుకొచ్చింది . రోజంతా కెమెరా ముందు కష్టపడి, రాత్రికి ఒంటరిగా హోటల్ గదికి వెళ్లడం తనను తీవ్రంగా కుంగదీసిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. చాలా కాలంగా షూటింగ్స్ చేస్తున్నాను కాబట్టి ఇది అలవాటైపోతుందని అనుకున్నాను, కానీ ఈసారి ఒంటరితనం నన్ను గట్టిగా చుట్టుముట్టింది అని ఆమె పేర్కొన్నారు.

కుటుంబమే కొండంత అండ

ఈ మానసిక ఒత్తిడి నుంచి బయటపడటానికి తన కుటుంబం చెన్నైకి రావడం ఎంతో సాయపడిందని మాళవిక తెలిపారు. ముఖ్యంగా ఆమె నానమ్మ ఎప్పుడూ ఇంటి నుంచి బయటకు రారు, కానీ మనవరాలి కోసం ఆమె కూడా చెన్నై రావడం మాళవికకు ఎంతో బలాన్ని ఇచ్చింది. వారితో కలిసి చెన్నై, మహాబలిపురంలోని పురాతన దేవాలయాలను సందర్శించి, స్థానిక రుచులను ఆస్వాదించడంతో ఆమె మనసు కుదుటపడింది.

►ALSO READ | Saraswathi OTT: ఓటీటీకి వచ్చిన కోర్ట్‌రూమ్ క్రైమ్ డ్రామా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ముంబై మళ్ళీ ప్రేమలో పడేసింది!

షూటింగ్ ముగించుకుని తిరిగి ముంబై చేరుకున్న మాళవిక, సాయంత్రం వేళల్లో పడవ ప్రయాణం చేస్తూ సూర్యాస్తమయాన్ని ఆస్వాదించారు. సముద్రపు గాలి, అలల సవ్వడి నా మనసును నయం చేశాయి. ఇంటిపై ఉన్న బెంగ నన్ను ముంబై నగరంపై మరింత ప్రేమ పెంచుకునేలా చేసింది అని ఆమె తన పోస్ట్‌ను ముగించారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. ఇటీవల ప్రభాస్ సరసన నటించిన 'ది రాజా సాబ్ ' కాస్త నిరాశ పరిచినా వరుస సినిమాలతో దూసుకెళ్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News