Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆ యూట్యూబర్ టార్గెట్ చేయటం వల్లనే బిజినెస్ ఇన్‌ఫ్లుయెన్సర్ హరీష్ చనిపోయాడా..?

ఆ యూట్యూబర్ టార్గెట్ చేయటం వల్లనే బిజినెస్ ఇన్‌ఫ్లుయెన్సర్ హరీష్ చనిపోయాడా..?

V6 Velugu 14 hrs ago

సోషల్ మీడియాలో లక్షల మంది ఫాలోవర్లతో ఆర్థిక పాఠాలు చెప్పి, తిరుగులేని సామ్రాజ్యాన్ని సృష్టించుకున్న యువ ఫిన్‌ఫ్లుయెన్సర్ 'ఫైనాన్స్ విత్ హరీష్' ఆత్మహత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

27 ఏళ్ల వయసులో.. 5 ఏళ్ల కఠిన శ్రమతో 13 లక్షల మంది అభిమానులను సంపాదించుకున్న హరీష్ బలవన్మరణం చెన్నైలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటన వెనుక మరో యూట్యూబర్, వెంచర్ స్టూడియో సీఈఓ జేసన్ శామ్యూల్ కక్షసాధింపు చర్యలే కారణమనే ఆరోపణలు సర్వత్రా చర్చనీయాంశం అయ్యాయి.

కావాలనే వాంటెడ్‌గా హరీష్‌ను టార్గెట్ చేశారన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. తనకున్న సోషల్ మీడియా పవర్‌తో హరీష్‌ను మానసికంగా కుంగదీయాలని జేసన్ శామ్యూల్ పక్కా ప్లాన్ వేసినట్లు స్పష్టమవుతోంది. హరీష్‌పై తప్పుడు ఆరోపణలతో బహిరంగంగా వీడియోలు చేయడమే కాకుండా.. మెటా సంస్థ ద్వారా 13 లక్షల ఫాలోవర్లు ఉన్న అతని ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను బ్లాక్ చేయించడంలో శామ్యూల్ కీలక పాత్ర పోషించారనేది స్పష్టమవుతోంది. 5 ఏళ్లుగా చెమటోడ్చి నిర్మించుకున్న సోషల్ మీడియా ప్రొఫైల్ క్షణాల్లో కనుమరుగైపోవడంతో హరీష్ మానసిక క్షోభను అనుభవించాడు.

మరణానికి ముందు హరీష్ స్వయంగా విడుదల చేసిన వీడియో కొన్ని షాకింగ్ నిజాలను బట్టబయలు చేసింది. పుదుచ్చేరి రాజకీయ నాయకుల అండదండలున్నాయని హెచ్చరిస్తూ.. జేసన్ శామ్యూల్ తనను బ్లాక్‌మెయిల్ చేసి డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నించాడని హరీష్ ఆవేదన వ్యక్తం చేశాడు. తనపై కావాలనే కక్షగట్టి వేధించాడని కన్నీరుమున్నీరయ్యాడు.

ఒక తోటి క్రియేటర్‌ ఎదుగుదలను ఓర్వలేక.. పబ్లిసిటీ కోసం, బ్లాక్‌మెయిల్ రాజకీయాలతో హరీష్‌పై టార్గెటెడ్ ఎటాక్ చేసి అతని ప్రాణాలు తీశాడు జేసన్. పైగా జస్ట్ ప్రశ్నిస్తే తప్పేంటంటూ అహంకారంగా రియాక్ట్ అవట్టాన్ని నెటిజన్లు తీవ్రంగా తప్పుపడుతున్నారు. చట్టపరమైన నిబంధనల పేరుతో కొందరిపై వ్యక్తిగత కక్షలు సాధిస్తూ అమాయక ప్రాణాలను బలితీసుకోవడం క్షమించరాని నేరం అని అంటున్నారు. ఈ రోజుల్లో ఎవరికి నచ్చిన పనిని వాళ్లు చేసుకుంటూ జీవిస్తుంటే అందులో పొరపాట్లు, తప్పులు ఉంటే సరిదిద్దుకోమని సలహా ఇవ్వాలి లేదా కుదిరితే అందుకు సహాయం చేయాలి కాలి వ్యక్తి చనిపోయేంతలా బ్లాక్ మెయిల్ చేసి ఒత్తిడి పెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. తమిళనాడు సర్కార్ ఇలాంటి వారిపై గట్టి చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News