Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆదిలాబాద్ జిల్లాలో ఎయిర్‌పోర్ట్ భూసేకరణ గడువులోగా పూర్తిచేయాలి : కలెక్టర్ రాజర్షిషా

ఆదిలాబాద్ జిల్లాలో ఎయిర్‌పోర్ట్ భూసేకరణ గడువులోగా పూర్తిచేయాలి : కలెక్టర్ రాజర్షిషా

V6 Velugu 3 weeks ago

దిలాబాద్​ టౌన్, వెలుగు: జిల్లాలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఎయిర్‌పోర్ట్, ఇండస్ట్రియల్ పార్క్ భూసేకరణ ప్రక్రియను చట్టపరమైన చిక్కులు లేకుండా పకడ్బందీగా గడువులోగా పూర్తిచేయాలని ఆదిలాబాద్​కలెక్టర్ రాజర్షిషా ఆదేశించారు.

కలెక్టరేట్ లో గురువారం భూసేకరణ విభాగ ప్రత్యేక అధికారి మనోహర్ తో కలిసి కలెక్టర్​ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించి అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్టును ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నామని, డిసెంబర్ 31 నాటికి సంబంధిత ఏజెన్సీలకు భూమిని అప్పగించేలా రెవెన్యూ అధికారులు కార్యాచరణను స్పీడప్ చేయాలని ఆదేశించారు. భూసేకరణలో న్యాయపరమైన సమస్యలు రాకుండా చూసుకోవాలన్నారు. సమావేశంలో అడిషనల్​కలెక్టర్ రాజేశ్వర్, ఆర్డీవో జగదీశ్వర్ రావు, ఏవో వర్ణ, సర్వేయర్లు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News