Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆర్మీ చేతిలో అయోధ్య రాముడు.. ట్రస్ట్ తొలి సీఈవో జితేంద్ర మిశ్రా బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే..

ఆర్మీ చేతిలో అయోధ్య రాముడు.. ట్రస్ట్ తొలి సీఈవో జితేంద్ర మిశ్రా బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే..

V6 Velugu 1 week ago

ఢిల్లీ: అయోధ్య రామ మందిర్ ట్రస్ట్ సీఈవోగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా నియామకంతో ఆయన బ్యాక్ గ్రౌండ్ తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు.

ఒక మాజీ ఎయిర్ మార్షల్కు రామ మందిర్ ట్రస్ట్ బాధ్యతలు అప్పగించడంతో అయోధ్య రాముడు ఆర్మీ చేతిలో సేఫ్గా ఉంటాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

భారత వైమానిక దళంలో జితేంద్ర మిశ్రా విశేష సేవలందించారు. ఆయనకు మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. అయోధ్య రామ మందిర్ ట్రస్ట్ సీఈవోగా ఆయన అయితేనే అక్రమాలకు చెక్ పడుతుందని అయోధ్య రామ్ మందిర్ ట్రస్ట్ భావించింది. ఈ క్రమంలోనే.. జితేంద్ర మిశ్రాను సీఈవోగా నియమిస్తున్నట్లు ప్రకటించింది.

జితేంద్ర మిశ్రా 39 ఏళ్ల పాటు వైమానిక దళంలో సేవలందించారు. 2026, ఏప్రిల్ 30న పదవీ విరమణ చేశారు. జితేంద్ర మిశ్రా పశ్చిమ వైమానిక దళ కమాండ్ అధిపతిగా పనిచేశారు. ఆయనకు 3 వేల గంటలకు పైగా విమానం నడిపిన అనుభవం ఉంది. ఆపరేషన్ సింధూర్‌లో కీలక పాత్ర పోషించారు.

* రామ దేవాలయ ట్రస్ట్‌కు తొలి సీఈఓగా ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా
* ఆపరేషన్ సింధూర్ సమయంలో వెస్ట్రన్ ఎయిర్ కమాండ్‌కు నాయకత్వం వహించిన మిశ్రా
* జితేంద్ర మిశ్రా స్వస్థలం ఉత్తర ప్రదేశ్లోని డియోరియా
* 1986, డిసెంబర్ 6న ఫైటర్ పైలట్‌గా భారత వైమానిక దళంలో నియమితులైన మిశ్రా
* ఫైటర్ కంబాట్ లీడర్ & టెస్ట్ పైలట్: మిశ్రా అమెరికాలోని ఎయిర్ కమాండ్ అండ్ స్టాఫ్ కాలేజీ పూర్వ విద్యార్థి కూడా
* మిగ్-21 స్క్వాడ్రన్‌కు కమాండర్‌గా వ్యవహరించారు
* హెచ్‌ఏఎల్‌లో చీఫ్ టెస్ట్ పైలట్‌గా, సుఖోయ్ సు-30 ఎంకేఐ బేస్‌కు చీఫ్ ఆపరేషన్స్ ఆఫీసర్‌గా పనిచేసిన అనుభవం
* సుఖోయ్ సు-30 ఎంకేఐ బ్లాక్ IV, బ్రహ్మోస్ ఇంటిగ్రేషన్ ప్రాజెక్టులలో కీలక పాత్ర
* వెస్ట్రన్ ఎయిర్ కమాండ్: జనవరి 2025 నుంచి ఏప్రిల్ 2026 వరకు ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్- ఇన్ -చీఫ్‌గా పనిచేసిన మిశ్రా
* జితేంద్ర మిశ్రా చేసిన సేవలకు గానూ విశిష్ట సేవా పతకం (VSM) ప్రదానం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News