Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆషాఢమాసం బోనాలు స్పెషల్.. హైదరాబాబాద్ బోనాల వేడుకలు .. ఏ రోజు ఎక్కడంటే..!

ఆషాఢమాసం బోనాలు స్పెషల్.. హైదరాబాబాద్ బోనాల వేడుకలు .. ఏ రోజు ఎక్కడంటే..!

V6 Velugu 1 hr ago

షాఢం వచ్చిందంటే .. హైదరాబాద్​ లో బోనాల సందడి అంతా ఇంతా కాదు. తెలంగాణ సంస్కృతిలో బోనాల వేడుకలకు చాలా ప్రాధాన్యత ఉంది. వివిధ రూపాల్లో.. అరేక పేర్లతో కొలువైన అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి..

బోనం సమర్పిస్తారు. హైదరాబాద్​లో గోల్కొండ జగదాంబిక అమ్మవారి నుంచి లాల్‌దర్వాజా సింహవాహిని అమ్మవారి వరకు ఈ ఏడాది (2026) వివిధ ఆలయాల్లో బోనాల తేదీల గురించి తెలుసుకుందాం. . .

హైదరాబాద్​ లో బోనాల వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. ఆషాఢమాసం నెల రోజుల పాటు కొనసాగే ఈ సందడి హైదరాబాద్ నగరంలో అత్యంత వైభవంగా నిర్వహింస్తారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల ప్రకారం నిర్వించే బోనాల బోనాల పండుగకు తెలంగాణ ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జూలై 16 నుంచి ఆగస్టు 13 వరకు బోనాల పండుగను నిర్వహించనున్నారు. ఈ వేడుకల్లో గ్రామ దేవతలను పూజిస్తారు.

సాధారణంగా ఆషాడ మాసం ప్రారంభం తర్వాత వచ్చే మొదటి గురువారం లేదా ఆదివారం రోజునబోనాల సందడి మొదలవుతుంది. ఈ ఏడాది ఆషాడ మాసంలో ముందుగా గురువారం (జూలై 16 ) వస్తుంది. అందుకే జూలై 16న రోజన బోనాలు ప్రారంభం కానున్నాయి.
ప్రతి ఏడాది తొలుత గోల్కొండలో జగదాంబిక అమ్మవారికి పచ్చి కుండతో ..బంగారు బోనం సమర్పిస్తారు. గోల్కొండ తర్వాత ఉజ్జయిని మహంకాళికి, లాల్ దర్వాజ మాహాకాళికి బోనాలు నిర్వహిస్తారు. గోల్కొండ కోటలో చివరి బోనంతో భాగ్యనగరంలో ఈ ఉత్సవాలను ముగుస్తాయి.

ఆషాఢమాసంలో ప్రతి ఆదివారం, గురువారం.. మొత్తంగా తొమ్మిది రకాల పూజలను అమ్మవారు అందుకుంటారు. సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు ఆగస్టు 2వ తేదీన, లాల్‌దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాలు ఆగస్టు 9వ తేదీన జరగనున్నాయి.

ముఖ్యమైన తేదీలు...

  • జూలై 16 : గోల్కొండ జగదాంబిక అమ్మవారి బోనాలు
  • జూలై 19 : సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని అమ్మవారి ఘటోత్సవం(ఎదురుకోలు)
  • జూలై 26 : బల్కంపేట ఎల్లమ్మ బోనాలు
  • ఆగస్టు 2 : సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు
  • ఆగస్టు 3: సికింద్రాబాద్‌ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో రంగం (భవిష్య వాణి)
  • ఆగస్టు 9 : పాతబస్తీ లాల్‌దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాలు
  • ఆగస్టు 10: రంగం కార్యక్రమం, అమ్మవారి ఘటాల ఊరేగింపు

బోనాల వేడుకల్లో డప్పు చప్పుళ్లు, పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు, కళాకారులు ఆటపాటలు, డీజే సౌండ్స్‌తో నగరం పండుగ శోభను సంతరించుకుంటుంది. హైదరాబాద్​లో జరిగే బోనాలను చూసేందుకు, అమ్మవార్లను దర్శించుకునేందుకు తెలంగాణ నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తుంటారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News