Dailyhunt
ఆటో ఎల్పీజీ సరఫరాకు అంతరాయం కలగొద్దు : సివిల్ సప్లయ్స్ కమిష నర్ స్టీఫెన్ రవీంద్ర

ఆటో ఎల్పీజీ సరఫరాకు అంతరాయం కలగొద్దు : సివిల్ సప్లయ్స్ కమిష నర్ స్టీఫెన్ రవీంద్ర

V6 Velugu 1 week ago
  • ప్రైవేట్ మార్కెటింగ్ కంపెనీలకు కమిషనర్​ స్టీఫెన్ రవీంద్ర ఆదేశం

హైదరాబాద్‌, వెలుగు: వారం రోజుల్లో 363 టన్నుల ఆటో ఎల్పీజీని సమకూర్చి సరఫరా చేయడంతో పాటు మూతపడిన 17 ఔట్‌లెట్లను తిరిగి ప్రారంభించేలా చర్యలు తీసుంటామని సివిల్ సప్లయ్స్​ కమిషనర్​ స్టీఫెన్​రవీంద్ర వెల్లడించారు.

మంగళవారం ఆయన ఆటో ఎల్పీజీ సరఫరాపై ప్రైవేట్ మార్కెటింగ్ కంపెనీలతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కమిషనర్​ మాట్లాడుతూ.. ఆటో డ్రైవర్ల జీవనోపాధికి ఆటో ఎల్పీజీ సరఫరా అత్యంత కీలకమన్నారు. ఎటువంటి అంతరాయం లేకుండా ఎల్పీజీ సరఫరా కొనసాగించేందుకు అన్ని సంస్థలు కట్టుబడి ఉండాలన్నారు. సివిల్​సప్లయ్స్​ శాఖ కట్టుదిట్టమైన పర్యవేక్షణ కొనసాగిస్తూ రోజువారీగా ఔట్‌లెట్ల పని తీరును పరిశీలిస్తున్నదని తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News