Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఐటీసీ ఇన్ఫోటెక్‌లో హ్యాపియెస్ట్ మైండ్స్ విలీనం.. డీల్‌ విలువ రూ.13వందల29 కోట్లు

ఐటీసీ ఇన్ఫోటెక్‌లో హ్యాపియెస్ట్ మైండ్స్ విలీనం.. డీల్‌ విలువ రూ.13వందల29 కోట్లు

V6 Velugu 3 weeks ago

న్యూఢిల్లీ: బెంగళూరుకు చెందిన ఐటీ కంపెనీ హ్యాపియెస్ట్ మైండ్స్ టెక్నాలజీస్, ఐటీసీ ఇన్ఫోటెక్ ఇండియా లిమిటెడ్‌లో విలీనం కానుంది. హ్యాపియెస్ట్ మైండ్స్ ఫౌండర్‌ అశోక్ సూత, అశోక్ సూత మెడికల్ రీసెర్చ్ ఎల్‌ఎల్‌పీ తమకున్న 22.1శాతం వాటాను (3.366 కోట్ల షేర్లు) రూ.1,329.72 కోట్లకు ఐటీసీకి అమ్ముతారు.

మొదటి విడతలో 11శాతం వాటాను షేరుకు రూ.390 చొప్పున (రూ.653.26 కోట్లు), రెండో విడతలో 11.106 శాతం వాటాను షేరుకు రూ.400 చొప్పున (రూ.676.46 కోట్లు) ఐటీసీ ఇన్ఫోటెక్ కొనుగోలు చేస్తుంది. కొత్త షేర్లు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో లిస్ట్ అవుతాయి. రాబోయే 15 నెలల్లో విలీనం పూర్తవుతుందని అంచనా.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News