Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
AMB Mall ఎదురున్న ఈ వాహ్ మండీలో ఎప్పుడైనా తిన్నారా..? ఫుడ్ సేఫ్టీ రైడ్స్లో ఏం తేలిందంటే..

AMB Mall ఎదురున్న ఈ వాహ్ మండీలో ఎప్పుడైనా తిన్నారా..? ఫుడ్ సేఫ్టీ రైడ్స్లో ఏం తేలిందంటే..

V6 Velugu 6 days ago

హైదరాబాద్:AMB Mall ఎదురున్న వాహ్ మండీలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. శుచి శుభ్రత విషయంలో.. ఈ మండీకి 100కు 61 మార్కులు మాత్రమే వేశారు.

కిచెన్లో గానీ, మండీలో మరెక్కడా గానీ పురుగులు, బొద్దింకలు లాంటివి కనిపించలేదు. ఫ్రీజర్‌లను శుభ్రంగా ఉంచారు.

చికెన్, మటన్ నిల్వ పరిమితంగా ఉంది. పాడైపోయిన, నిల్వ ఉంచిన వండిన.. ఉడికించిన గుడ్లు, చికెన్ వింగ్స్‌ను గుర్తించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు అక్కడికక్కడే పారవేశారు. పాత్రలు కడుక్కోవడానికి వాష్ ఏరియాలో తగినంత ప్రదేశం లేదని గుర్తించారు. వేడి నీటితో శానిటైజ్ చేయడం పాటించలేదని తేల్చారు.

ALSO READ : నూడుల్స్‌ తిని 14 దేశాల్లో 106 మంది ఆస్పత్రిపాలు.. 49 మందికి సీరియస్‌..

పచ్చి, వండిన మాంసాన్ని కలిపి నిల్వ చేసినట్లు గుర్తించారు. శాకాహార, మాంసాహార వస్తువులను సరిగ్గా వేరు చేయలేదని.. కూరగాయలు కోసే చోట గోడలు, పైకప్పు పెచ్చులూడటాన్ని గమనించారు. పాడైపోయిన ఆహార పదార్థాలను అక్కడికక్కడే పారవేశారు. మెరుగుదల నోటీసును జారీ చేసి, వెంటనే పద్ధతి మార్చుకోవాలని మండీ యాజమాన్యానికి సూచించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News