Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అర్హులందరికీ ఇల్లు మంజూరు చేస్తాం : ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

అర్హులందరికీ ఇల్లు మంజూరు చేస్తాం : ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

V6 Velugu 2 weeks ago

గంగాధర/బోయినిపల్లి, వెలుగు: ఇందిరమ్మ ఇండ్లు నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయని, చొప్పదండి నియోజకవర్గంలో ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇల్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు.

కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను మధురానగర్​లోని ప్రజా కార్యాలయంలో బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇండ్లు రానివారు ఆందోళన చెందవద్దని, రానున్న రోజుల్లో అర్హులైన ప్రతిఒక్కరికి ఇళ్లను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.

అనంతరం బోయినిపల్లి మండలానికి చెందిన 22 మంది లబ్ధిదారులకు రూ.6.97లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మహేందర్, డీసీసీ ఉపాధ్యక్షుడు మనోహర్, మహిళా కాంగ్రెస్ మండల అధ్యక్షురాలు చిరుత మంగ, మండల అధ్యక్షుడు సువీన్ యాదవ్, ఏఎంసీ చైర్మెన్ బోయిని ఎల్లేష్ యాదవ్, నాయకులు లీడర్లు ముద్దం నగేశ్‌, వేముల భాస్కర్, ఆంజనేయులు, పన్నెల రమణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News