Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అసైన్డ్ కమిటీ ద్వారా పేదలకు పట్టాలు : మంత్రి జూపల్లి కృష్ణారావు

అసైన్డ్ కమిటీ ద్వారా పేదలకు పట్టాలు : మంత్రి జూపల్లి కృష్ణారావు

V6 Velugu 1 week ago

నపర్తి/వీపనగండ్ల, వెలుగు: రాష్ట్రంలోనే తొలిసారిగా కొల్లాపూర్‌ నియోజకవర్గంలో అసైన్డ్ కమిటీ ఏర్పాటు చేసి వీపనగండ్ల మండలం సంపత్‌రావుపల్లి గ్రామంలో భూమి లేని పేదలకు పట్టాలు ఇప్పించేలా చర్యలు తీసుకున్నట్లు రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.

ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా ఫిర్యాదులపై కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి సోమవారం ఎంపీడీవో ఆఫీస్‌లో మంత్రి రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని, వాట్సాప్ నంబరు 81858 85127 ద్వారా కూడా ఫిర్యాదులు పంపొచ్చన్నారు.

అధికారులు వాటిని పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు. ప్రతి ఫిర్యాదును వారంలో పరిష్కరించాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. వీపనగండ్లకు చెందిన బీచుపల్లి గౌడ్ తన భూమికి సంబంధించిన సర్వే సమస్యపై ఫిర్యాదు చేయగా, రెవెన్యూ అధికారులు సమస్య పరిష్కారంలో జాప్యం చేయడంపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అడిషనల్​కలెక్టర్‌ వినోద్‌కుమార్‌కు సూచించారు. సమావేశంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ తిరుపతయ్య, ఆర్డీవో సుబ్రహ్మణ్యం, జడ్పీ సీఈవో యాదయ్య, సర్పంచ్ పార్వతమ్మ, అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News