Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అసెట్ అలొకేషన్ ఎంతో కీలకం.. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్

అసెట్ అలొకేషన్ ఎంతో కీలకం.. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్

V6 Velugu 2 hrs ago

హైదరాబాద్​, వెలుగు: మ్యూచువల్ ఫండ్లు ఎలాంటివి అయినా, అసెట్​అలోకేషన్​ ఎంతో కీలకమని ఎస్​బీఐ మ్యూచువల్ ఫండ్ తెలిపింది. దీని రిపోర్ట్​ ప్రకారం..చాలా మంది పెట్టుబడిదారులు ఇటీవల బాగా రాణించిన ఈక్విటీలు లేదా బంగారం లాంటి వాటిలోనే పెట్టుబడి పెట్టడానికి మొగ్గు చూపుతారు.

మార్కెట్ పరిస్థితులను బట్టి రాణించే ఆస్తుల విభాగం మారుతూ ఉంటుంది.

ఈ నేపథ్యంలోనే ఆస్తుల కేటాయింపు ఎంతో కీలకం. గత మూడు దశాబ్దాల డాట్ కామ్ బూమ్, 2008 ఆర్థిక సంక్షోభం, కరోనా వంటి వివిధ మార్కెట్ సైకిల్స్ దీనిని నిరూపించాయి. ఆర్థిక వృద్ధి సమయంలో ఈక్విటీలు, మార్కెట్ అస్థిరత వేళ బంగారం రక్షణగా నిలుస్తాయి. వడ్డీ రేట్లు తగ్గే కాలంలో ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ సాధనాలు స్థిరత్వాన్ని ఇస్తాయి.

ఏ ఒక్క విభాగానికి చెందిన ఆస్తులు ప్రతి సంవత్సరం ఉత్తమ రాబడులను అందించలేవు. కరోనా సమయంలో ఈక్విటీలు వేగంగా పతనమైనప్పుడు బంగారం పెట్టుబడులకు రక్షణగా నిలిచింది. 2021 మార్కెట్ రికవరీలో ఈక్విటీలు పుంజుకోగా, బంగారం వెనుకబడింది. ఒకే విభాగంలో పెట్టుబడులు కేంద్రీకరించడం వల్ల నష్టాలు పెరుగుతాయి. వివిధ అసెట్ క్లాస్‌లలో వైవిధ్యభరితమైన పెట్టుబడులు పెట్టడం ద్వారా ఒడిదుడుకులను తట్టుకుని స్థిరమైన రాబడులు పొందవచ్చని ఎస్​బీఐ మ్యూచువల్​ఫండ్స్​తెలిపింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News