Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అశ్వారావుపేట: తల్లి ప్రవర్తన నచ్చక కొడుకు సూసైడ్

అశ్వారావుపేట: తల్లి ప్రవర్తన నచ్చక కొడుకు సూసైడ్

V6 Velugu 1 hr ago

శ్వారావుపేట, వెలుగు: తల్లి ప్రవర్తన నచ్చక ఓ యువకుడు సూసైడ్​ చేసుకున్నాడు. ఎస్సై యయాతి రాజు తెలిపిన వివరాల ప్రకారం.. అశ్వారాపేట మండలంలోని దబ్బతోగు గ్రామానికి చెందిన సరియం క్రాంతికుమార్ (22) తల్లి కళావతి మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు సమాచారం.

అతడితోనే వినాయకపురం గ్రామంలో ఉంటోంది. తల్లిని ప్రవర్తన మార్చుకోవాలని క్రాంతికుమార్​ పలుమార్లు కోరాడు.

అయినా మార్పు లేకపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. సోమవారం దబ్బ తోగు కాలనీ సమీపంలో ఉన్న చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్తులు గాలింపు చర్యలు చేపట్టి మంగళవారం ఉదయం మృతదేహాన్ని వెలికితీశారు. పోలీసులు పోస్టుమార్టం కోసం అశ్వారావుపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడి బాబాయి మునయ్య ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News