Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అయ్యో ఎంత పని జరిగింది: రిటైర్మెంట్ రోజే  ఐఏఎస్‌ అరెస్ట్‌..రూ.169 కోట్ల బ్యాంకింగ్‌ ఫ్రాడ్‌ చేసినట్లు గుర్తించిన సీబీఐ

అయ్యో ఎంత పని జరిగింది: రిటైర్మెంట్ రోజే ఐఏఎస్‌ అరెస్ట్‌..రూ.169 కోట్ల బ్యాంకింగ్‌ ఫ్రాడ్‌ చేసినట్లు గుర్తించిన సీబీఐ

V6 Velugu 2 weeks ago

చండీగఢ్‌: హర్యానాలో ఓ ఐఏఎస్ ఆఫీసర్​ను ఆయన రిటైర్మెంట్​ రోజే సీబీఐ అరెస్టు చేసింది. బ్యాంకింగ్ ఫ్రాడ్ కేసులో అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

ఐఏఎస్‌ అధికారి ప్రదీప్‌ కుమార్‌ గతంలో ఆయన హర్యానా స్టేట్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు (హెచ్‌ఎస్‌పీసీబీ) మెంబర్ సెక్రటరీగా పనిచేశారు.

అప్పుడు రూ.169 కోట్ల ప్రభుత్వ నిధులను ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేస్తున్నట్లు చూపించి, కాజేసినట్లు సీబీఐ ఆరోపించింది. ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌లో 'హెచ్‌ఎస్‌పీసీబీ' పేరిట ఎలాంటి అధికారిక అనుమతులు లేకుండా ఒక నకిలీ బ్యాంకు ఖాతా తెరిచారు.

ప్రభుత్వ నిధుల నుంచి రూ.169 కోట్లను ఫిక్స్‌డ్‌ డిపాజిట్లుగా మారుస్తున్నట్లు చూపించారు. ఆ తర్వాత వాటిని నకిలీ లావాదేవీల ద్వారా స్వాహా చేసినట్లు దర్యాప్తులో తేలింది. పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ ప్రదీప్‌కుమార్‌ సహకరించలేదని సీబీఐ తెలిపింది. ముందస్తు బెయిల్‌ కోసం ఆయన పంచకుల కోర్టును ఆశ్రయించగా, ఆ పిటిషన్‌పై జూలై 2న విచారణ జరగాల్సి ఉంది. ఈలోగా సీబీఐ అరెస్ట్‌ చేసింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News