Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బాండ్లలో పెరిగిన విదేశీ పెట్టుబడులు

బాండ్లలో పెరిగిన విదేశీ పెట్టుబడులు

V6 Velugu 2 hrs ago

న్యూఢిల్లీ:విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులు (ఎఫ్​పీఐలు) ఫుల్లీ యాక్సెసిబుల్ రూట్ (ఎఫ్ఏఆర్) కింద ప్రభుత్వ సెక్యూరిటీలలో రూ. 8,794.743 కోట్ల పెట్టుబడులు పెట్టారు.

ఈ బాండ్లపై వచ్చే వడ్డీ ఆదాయం, మూలధన లాభాలపై ఆదాయపు పన్ను మినహాయింపు ఇచ్చిన తర్వాత ఇవి పెరిగాయి.

ఎఫ్ఏఆర్ సెక్యూరిటీలలో ఎఫ్​పీఐ హోల్డింగ్స్ విలువ జూన్ మూడున రూ. 3.23 లక్షల కోట్లు ఉండగా, మంగళవారం నాటికి రూ. 3.32 లక్షల కోట్లకు చేరింది. పన్ను మినహాయింపు నిర్ణయం విదేశీ పెట్టుబడిదారులలో నమ్మకాన్ని పెంచింది. బ్లూమ్‌బర్గ్ సావరిన్ బాండ్ ఇండెక్స్ లాంటి ప్రపంచ బాండ్ ఇండెక్స్​లో భారత్ చేరడానికి ఇది దోహదం చేస్తుంది. ఆర్‌బీఐ 15, 30, 40 ఏళ్ల కొత్త ప్రభుత్వ సెక్యూరిటీలను ఎఫ్ఏఆర్​లో చేర్చింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News