Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బంజారాహిల్స్ హరేకృష్ణ గోల్డెన్ టెంపుల్లో సెప్టెంబర్ 4న శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

బంజారాహిల్స్ హరేకృష్ణ గోల్డెన్ టెంపుల్లో సెప్టెంబర్ 4న శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

V6 Velugu 3 weeks ago

హైదరాబాద్​సిటీ, వెలుగు: బంజారాహిల్స్​లోని హరేకృష్ణ గోల్డెన్​ టెంపుల్​లో ఈ నెల 4న శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు హరేకృష్ణ మూవ్​మెంట్​ ప్రెసిడెంట్​సత్య గౌర చంద్ర దాస ప్రభూజీ మంగళవారం తెలిపారు.

ఈసారి రాధాగోవింద, గోదాకృష్ణ, లడ్డుగోపాల్, శ్రీమాఖన్​కృష్ణ పేర్లతో శ్రీకృష్ణుడి మనోహర రూపాలను దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. భక్తులందరికీ శ్రీమాఖన్​కృష్ణుడి ఉయ్యాల సేవలో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. 4న ఉదయం 7 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు స్వామి వారికి వివిధ రకాల సేవలు జరపనున్నట్లు పేర్కొన్నారు. వేడుకలు గోల్డెన్​ టెంపుల్​తోపాటు, నార్సింగిలోని హరేకృష్ణ హెరిటేజ్​టవర్, సంగారెడ్డిలోని కందిలోని హరేకృష్ణ కల్చరల్​సెంటర్​లోనూ జరుగుతాయన్నారు. 5న నందోత్సవం, వ్యాసపూజ ఉంటాయని తెలిపారు.

శంకర్​పల్లిలో గోవిందోత్సవ్..

పంజాగుట్ట: శంకర్​పల్లి త్రిపుర రిసార్ట్ లో గోవిందోత్సవ్-2026 వేడుకలను నిర్వహించనున్నట్లు ఇస్కాన్ జూబ్లీహిల్స్ కన్వీనర్ నరేంద్ర తెలిపారు. సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో పోస్టర్​ను ఇస్కాన్​ప్రతినిధులు సమర్థ కృష్ణ దాసు, అనిల్ తో కలిసి ఆవిష్కరించారు. వివిధ ప్రాంతాల నుంచి వేదిక వద్దకు చేరుకునేందుకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించినట్లు చెప్పారు. పాల్గొనాలనుకునేవారు 90529 75933 ​లో సంప్రదించాలని సూచించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News