Dailyhunt
బెల్లీ ఫ్యాట్ తో ప్రతి 10మంది మహిళల్లో ఆరుగురికి  ముప్పు! ..ఎందుకు ప్రమాదకరం? ఎలా తగ్గించుకోవాలి?

బెల్లీ ఫ్యాట్ తో ప్రతి 10మంది మహిళల్లో ఆరుగురికి ముప్పు! ..ఎందుకు ప్రమాదకరం? ఎలా తగ్గించుకోవాలి?

V6 Velugu 1 week ago

బెల్లీ ఫ్యాట్.. ఇదిరోజురోజుకు పెరుగుతున్న ఆరోగ్య సమస్యల్లో ఒకటి.. ఆడ మగ అనే తేడా లేకుండా వస్తుంది.. అయితే మహిళల్లో ఈ బెల్లి ఫ్యాట్ సమస్య అధికంగా ఉందని ఇటీవల పరిశోధనలు చెబుతున్నాయి.

30నుంచి 49 ఏళ్ల వయసున్న ప్రతి పదిమంది మహిళల్లో ఆరుగురు బెల్లిఫ్యాట్ సమస్యతో బాధపడుతున్నారని ఈ విసెరల్ ఫ్యాట్ చాలా ప్రమాదకరమని స్టడీస్ చెబుతున్నాయి. డయాబెటిస్ అండ్ మెటబాలిక్ సిండ్రోమ్ క్లినికల్ రీసెర్చ్ అండ్ రివ్యూస్ అనే జర్నల్‌లో ప్రచురితమైన తాజా పరిశోధనల లో ఈ విషయం బయటపడింది. మరి బెల్లిఫ్యాట్ సమస్యనుంచి బయటపడటం ఎలా? బెల్లీ ఫ్యాట్ ను కరిగించుకునేందుకు అందుబాటులో ఉన్న పద్దతుల గురించి తెలుసుకుందాం.

బెల్లీ ఫ్యాట్ కు చెక్ పెట్టే ఈజీ టిప్స్..

జీవనశైలి మార్పులతో బెల్లీ ఫ్యాట్ ను సులభంగా కరిగించుకోవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. కొన్ని ప్రభావవంతమైన పద్దతులు.

ఆరోగ్యకరమైన ఆహారం

తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు ,లీన్ ప్రొటీన్ (కొవ్వు లేని మాంసకృత్తులు) తీసుకోవడంపై పూర్తి దృష్టి పెట్టాలి. చక్కెర, రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లు, ప్రాసెస్ చేసిన ఆహారం కచ్చితంగా తగ్గించాలి. అలాగే ఫైబర్ (పీచు పదార్థం) ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.

క్రమం తప్పకుండా వ్యాయామం..

వాకింగ్, రన్నింగ్, సైక్లింగ్ వంటి కార్డియో వ్యాయామాలతో పాటు స్ట్రెంత్ ట్రైనింగ్ కూడా చేయాలి. వారానికి కనీసం 150 నిమిషాల పాటు శారీరక వ్యాయామం చేసేలా లక్ష్యంగా పెట్టుకోవాలి.

ALSO READ : మీ మెదడు జాగ్రత్త! ఈ 5 అలవాట్లు మీ మెదడును ముసలివిగా మారుస్తాయట!

తగినంత నిద్ర

సరైన నిద్ర లేకపోవడం అనేది నేరుగా బరువు పెరగడానికి ,హార్మోన్ల అసమతుల్యతకు దారితీస్తుంది. అందుకే రోజూ 7 నుంచి 8 గంటల పాటు ప్రశాంతమైన, నాణ్యమైన నిద్ర ఉండేలా చూసుకోవాలి.

ఒత్తిడిని జయించాలి..

దీర్ఘకాలిక ఒత్తిడి వల్ల శరీరంలో 'కార్టిసాల్' అనే హార్మోన్ స్థాయిలు పెరుగుతాయి.ఇది పొట్ట దగ్గర కొవ్వు పెరగడానికి కారణమవుతుంది.యోగా, ధ్యానం (మెడిటేషన్) లేదా శ్వాస సంబంధిత వ్యాయామాలు చేయాలి.

బెల్లీ ఫ్యాట్ రాత్రికి రాత్రే వచ్చే సమస్య కాదు.అలాగే రాత్రికి రాత్రే పోయేదీ కాదు. సరైన ఆహారపు అలవాట్లు, క్రమశిక్షణతో కూడిన జీవనశైలితో ఈ సైలెంట్ కిల్లర్‌ను తరిమికొట్టి, ఆరోగ్యకరమైన జీవితాన్ని సొంతం చేసుకోవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News