Dailyhunt
భద్రాద్రి కోఆపారేటివ్ అర్బన్ బ్యాంక్  టర్నోవర్ రూ.1030 కోట్లు

భద్రాద్రి కోఆపారేటివ్ అర్బన్ బ్యాంక్ టర్నోవర్ రూ.1030 కోట్లు

V6 Velugu 0 months ago

మ్మం టౌన్, వెలుగు : ఖమ్మం భద్రాద్రి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు గడిచిన ఆర్థిక ఏడాదికి రూ.1030 కోట్ల టర్నోవర్ సాధించినట్లు చైర్మన్ చెరుకూరి కృష్ణమూర్తి తెలిపారు.

బ్యాంకు టర్నోవర్ సాధించడంపై హర్షం వ్యక్తం చేస్తూ బుధవారం బ్యాంకులో అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ 29 ఏండ్లుగా స్థిరమైన అభివృద్ధిని సాధిస్తూ, ప్రతి ఏడాది వాటాదారులకు 18 శాతం డివిడెండ్ ను చెల్లిస్తూ, విశ్వసనీయతకు ప్రతీకగా బ్యాంకు నిలిచిందన్నారు.

రాష్ట్రంలోని 8 జిల్లాల్లో 25 బ్రాంచ్ లతో విస్తరించిన భద్రాద్రి బ్యాంకు రూ.1030 కోట్ల టర్నోవర్ సాధించడం గర్వంగా ఉందన్నారు. తమ విజయానికి కారణమైన బ్యాంకు వాటాదారులకు, ఖాతాదారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా డైరెక్టర్లు, వ్యవస్థాపక డైరెక్టర్లు గుర్రం ఉమామహేశ్వరరావు, రేఖల భాస్కర్, మద్ది బాబు, సర్వేపల్లి నిరంజన్ ను సన్మానించారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ సన్నే ఉదయ్ ప్రతాప్, వేములపల్లి వెంకటేశ్వరరావు, డైరెక్టర్లు దేవత రాజారావు,మద్ది పిచ్చయ్య, జయప్రద, రాజ్ పురోహిత్ చెన్ సింగ్, రంగ నాగ శ్రీనివాస్, దారా జీవన్, సీఈవో దాసరి వేణుగోపాల్, హెడ్ ఆఫీస్ స్టాఫ్, బ్రాంచ్ మేనేజర్లు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News