Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బీఆర్ఎస్ భవన్ గేటు దగ్గరే కేటీఆర్ ను అడ్డుకున్న పోలీసులు

బీఆర్ఎస్ భవన్ గేటు దగ్గరే కేటీఆర్ ను అడ్డుకున్న పోలీసులు

V6 Velugu 3 weeks ago

కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల సవాళ్లు, ప్రతిసవాళ్ళతో తెలంగాణ దద్దరిల్లుతోంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సవాల్ తో గురువారం ( జులై 2 ) ఉదయం మంత్రులు పొన్నం, అడ్లూరి, అజారుద్దీన్ లు గన్ పార్క్ దగ్గరికి చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.

తెలంగాణ భవన్ నుండి గన్ పార్క్ కు వెళ్లేందుకు ప్రయత్నించిన హరీష్ రావును అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ క్రమంలో కేటీఆర్ కూడా గన్ పార్క్ కు వెళ్లేందుకు ప్రయత్నించడంతో బీఆర్ఎస్ భవన్ దగ్గర మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్ఎస్ భవన్ గేటు దగ్గరే కేటీఆర్ ను అడ్డుకున్నారు పోలీసులు.

గన్ పార్క్ కు వెళ్లకుండా అడ్డుకోవడంతో పోలీసులతో వాగ్వాదానికి దిగారు కేటీఆర్. రాష్ట్ర అప్పులపై కేటీఆర్ విసిరిన సవాల్ పై స్పందించిన మంత్రి జూపల్లి తెలంగాణ భవన్ లో చర్చకు సిద్ధమంటూ కౌంటర్ ఇచ్చారు. దీంతో ఇవాళ కేటీఆర్ తెలంగాణ భవన్ కు చేరుకోగా.. గన్ పార్క్ కు రావాలని మరోసారి సవాల్ విసిరారు జూపల్లి.

జూపల్లి సవాల్ తో గన్ పార్క్ దగ్గరికి బయలుదేరిన కేటీఆర్ ను అడ్డుకున్నారు పోలీసులు. దీంతో మరోసారి బీఆర్ఎస్ భవన్ దగ్గర ఉద్రికత్త నెలకొంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News