Dailyhunt
బీఆర్ఎస్ హయాంలో మన జిల్లా నిధులు..వేరే జిల్లాలకు తరలించారు: మంత్రి వివేక్ వెంకటస్వామి

బీఆర్ఎస్ హయాంలో మన జిల్లా నిధులు..వేరే జిల్లాలకు తరలించారు: మంత్రి వివేక్ వెంకటస్వామి

V6 Velugu 1 week ago

కాళేశ్వరం పేరుతో బీఆర్ఎస్ వేల కోట్లు నీళ్ల పాలు చేసిందని విమర్శించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ జనరల్ బాడీ మీటింగ్ లో మాట్లాడిన ఆయన..

మంచిర్యాలకు రావాల్సిన నిధులు, సిద్దిపేట, సిరిసిల్లకు తరలించారని చెప్పారు. ఇపుడు మన నిధులు మన జిల్లాలోనే ఖర్చు పెట్టుకుంటున్నామని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్లు ,ఫ్రీ కంరెంట్ పేదలకు వరంగా మారిందన్నారు వివేక్. త్వరలో కొత్తగ 2 లక్షల కొత్త పెన్షన్లు ఇవ్వబోతున్నామని చెప్పారు.

కాంగ్రెస్ కార్యకర్తలను గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. కాంగ్రెస్ సర్కార్ అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు. పార్టీలో క్షేత్ర స్థాయి నుంచి మరింత బలోపేతం చేయాలన్నారు . పార్టీ బలోపేతానికి మహేశ్ కుమార్, మీనాక్షి కృషి చేస్తున్నారని తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News