Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బీఆర్ఎస్ నేతలు ఇలాగే వ్యవహరిస్తే...ఈసారి ప్రతిపక్ష హోదా కూడా రాదు: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

బీఆర్ఎస్ నేతలు ఇలాగే వ్యవహరిస్తే...ఈసారి ప్రతిపక్ష హోదా కూడా రాదు: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

V6 Velugu 1 week ago

బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల సవాళ్లు, ప్రతిసవాళ్లతో రాష్ట్రంలో రాజకీయ దుమారం రేగింది. ఇరువర్గాల నేతలు చర్చకు సిద్దమవ్వడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.

టెండర్ల విలువకంటే మూడు రెట్లు ఎక్కువ అవినీతి జరిగిందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ ఇలాగే వ్యవహరిస్తే వచ్చేసారి ప్రతిపక్ష హోదా కూడా రాదని అన్నారు.

బీఆర్ఎస్ చేసిన అవినీతి బురదను మాకు అంటించాలని చూస్తున్నారా అంటూ ప్రశ్నించారు పొంగులేటి. చర్చకు వెనకడుగు వేసే సంస్కృతి తమ ప్రభుత్వానికి లేదని.. గన్ పార్క్ దగ్గర మంత్రులు గంట సేపు వేచి చూశారని అన్నారు. మీరు తెలంగాణ భవన్ లో చిట్ చాట్ పేర్లతో టైమ్ పాస్ చేశారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ గూండాగిరికి బయపడేవాళ్ళం కాదని...అధికారంలో ఉన్న పదేళ్లు బిఆర్ఎస్ అహంకారం దొరల పోకడతో ప్రజలను పట్టించుకోలేదని అన్నారు.

బిఆర్ఎస్ నేతల తీరు దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని... తెలంగాణను ఎలా కొల్లగొట్టారో అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి వివరించారని అన్నారు. ప్రభుత్వం రద్దు చేసి ఎన్నికల రావాలని మతి భ్రమించి మాట్లాడుతున్నారని అన్నారు మంత్రి పొంగులేటి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News