Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బిగ్‌ స్క్రీన్‌పైకి 'మిర్జాపూర్ ది మూవీ': సెప్టెంబర్ 4న రిలీజ్

బిగ్‌ స్క్రీన్‌పైకి 'మిర్జాపూర్ ది మూవీ': సెప్టెంబర్ 4న రిలీజ్

V6 Velugu 7 hrs ago

బాలీవుడ్‌ స్టార్స్‌ పంకజ్‌ త్రిపాఠి, దివ్యేందు శర్మ, అలీ ఫజల్‌ ప్రధాన పాత్రల్లో నటించిన 'మిర్జాపూర్' సిరీస్‌కు ఓటీటీలో మంచి ఆదరణ దక్కింది. తాజాగా ఈ సిరీస్‌ను 'మిర్జాపూర్ ది మూవీ' టైటిల్‌తో సినిమాగా రూపొందించారు.

గుర్మీత్‌ సింగ్‌ దర్శకత్వం వహించగా, రితేష్‌ సిధ్వాని, ఫర్హాన్‌ అక్తర్‌ నిర్మించారు. సెప్టెంబర్‌ 4న హిందీ, తెలుగు భాషల్లో థియేట ర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ నిర్వహించారు. పంకజ్ త్రిపాఠి మాట్లాడుతూ 'మా వెబ్‌ సిరీస్‌కు ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన రెస్పాన్స్‌ వచ్చింది.

ఇప్పుడు దీన్ని బిగ్‌ స్క్రీన్‌పై చూసేలా సినిమాగా తీసుకొచ్చాం. తెలుగు ఆడియన్స్‌కు కాలీన్‌ భయ్యాగా కనెక్ట్ అయ్యా' అని అ న్నాడు. దివ్యేందు శర్మ మాట్లాడుతూ 'ప్రపంచవ్యాప్తంగా ఈ సిరీ స్‌కు ఫ్యాన్స్ ఉన్నారు. తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతగానో అభి మానించారు. సిరీస్‌లో ఒక్క ఎపిసోడ్‌ చూడకపోయినా థియేటర్‌లో ఎంజాయ్‌ చేయొచ్చు' అని చెప్పాడు. ఇందులో క్యారెక్టర్స్ సేమ్ అయినప్పటికీ సీన్స్ కొత్తగా ఉంటాయని అలీ ఫజల్ అన్నాడు. ఈ చిత్రంలో తా ను బబ్బన్ యాదవ్ అనే కొత్త పాత్ర పోషించానని రవి కిష న్ చెప్పాడు. బిగ్‌ స్క్రీన్‌పై మిర్జాపూర్‌ను తీసుకురావడం ఆనందంగా ఉందని దర్శకుడు గుర్మీత్ సింగ్ అన్నాడు. నటులు సోనాల్‌ చౌహాన్‌, జితేంద్ర కుమార్‌, శ్వేతా త్రిపాఠి, శ్రియా, హర్షిత గౌర్‌ పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News